రాలుతున్న పసుపు
Published Wednesday, 24 May 2017ఊహల లోగిల్లో
ఎదుగుతున్న యవ్వనాన్ని
పసుపు వర్ణంగా
ఆరబోయటం చూశాం
జీవిత సందర్భాల్ని
పసుపుతో ముడిపడటాన్ని
పలకరించాం
పసుపు మొక్కలు
అందంగా ఎదుగుతుంటే
ఆకాశంలోని హరివిల్లుల్ని
రాల్చుకున్నాం
నీరు పోసినప్పుడు
మదుపులు తెచ్చినప్పుడు
ఆఖరుకి గిడ్డంగులకి
పసుపు చేరేదాకా
స్వప్నాల్ని ఎగరేసుకున్నాం
ఇక్కడ ధర లేదు
ఉడికిపోతున్న
పసుపు రైతుల బతుకులు
గుంపుకట్టే
దళారీ రాజకీయాలు
చెమట చుక్కల్ని తాగుతున్నాయ
పండాల్సిన పసుపు ముఖాలు
బతుకెండిన బాధల్లో
పసుపుని రాల్చుకుంటున్నాయ