S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మళ్లీ మళ్లీ..!

తెలుగు, తమిళ చిత్రాల ద్వారా తన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన అందాల భామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఫెయిల్యూర్స్‌తో తెగ ఇబ్బందులు పడుతోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసిన ఈ అమ్మడు ఒక దశలో కెరీర్ ఇక ముగిసినట్టే అనుకుంది. అలానే అందరూ భావించారు కూడా. సరిగ్గా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ఆమె ఆశలను పదిలం చేసింది. ఆ చిత్రంతో మళ్లీ వెలుగులోకి వచ్చినట్లయింది. కాస్త ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం తాజాగా అజిత్, విజయ్‌లాంటి టాప్ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ చక్కటి కాంబినేషన్‌లు రిపీట్ చేస్తోంది. టాలీవుడ్‌లో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా తేజ దర్శకత్వంలో నటించింది. ప్రస్తుతం మరోసారి తేజ కాంబినేషన్‌లో రానాకు జోడీగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటిస్తున్న కాజల్, కళ్యాణ్‌రామ్‌తోనూ నటించేందుకు అంగీకరించింది. నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎమ్మెల్యే’ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా నటించనుంది. వీటితోనైనా కాజల్‌కు పూర్వ వైభవం వస్తుందేమోనని ఆమె సన్నిహితులు ఆశపడుతున్నారు.

-సమీర్