S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్ని చిన్ని ఆశ!

చిన్ని చిన్ని ఆశలేం కాదు, బాలీవుడ్ భామ నీతూచంద్రకి అన్నీ పెద్ద పెద్ద ఆశలే కలుగుతున్నాయి బలంగా మనసులో. ఇంతకీ విషయంలోకి వెళితే... ‘బాహూబలి’కి ధీటుగా తమిళంలో ‘సంఘమిత్ర’ను తెరకెక్కించాలన్న దర్శకుడు సుందర్ .సి ఆలోచనలకు బ్రేక్ వేస్తూ టైటిల్ రోలో పోషించాల్సిన శ్రుతిహాసన్ అనూహ్యాంగా ఈ ప్రాజెక్కు నుంచి తప్పుకుంది. దీంతో ‘సంఘమిత్ర’ ప్రధాన పాత్రకు ఏ కథానాయికను ఎంపిక చేసుకుంటారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ భామ నీతూచంద్ర కూడా ‘సంఘమిత్ర’ పాత్రపై మనసుపడిందట. ‘యావరుమ్ నలమ్’, ‘తీరాద విళైయాట్టు పిళ్లై’, ‘యుద్ధం సెయ్’, ‘ఆది భగవాన్’, ‘వైగై ఎక్స్‌ప్రెస్’ చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నీతూకి ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ఈ నేపథ్యంలో ‘సంఘమిత్ర’ కథానాయిక అనే్వషణపై తన మనసులోని మాటను ఇలా చెబుతోంది -‘‘నాటక కళాకారిణిగా, సాహసనారిగా నటించాలని నాకు ఎప్పటి నుంచొ ఆశ బలంగా వుంది. ‘సంఘమిత్ర’లో ఆ రెండూ వున్నాయి. ఆ ప్రాజెక్టులో నాకు అవకాశం రావాలని ఆశపడుతున్నా. అలా వస్తే నా కల నెరవేరుతుంది’’ అంది. వాహ్..నీతూ ఆల్ ది బెస్ట్!!

-సమీర్