ఎదురీత
Published Sunday, 11 June 2017ముళ్ళ కంచెలెన్నో దాటుకొచ్చా కానీ
నీ చూపుల కంచెలనే దాటలేకపోతున్నా!
కష్టాల కడలినే దాటుకొచ్చా కానీ
నీ మాటల సంద్రానే్న దాటలేకపోతున్నా!
ఆశల కలలెన్నో నింపుకొచ్చా కానీ
చేసిన బాసలను నింపుకోలేకపోతున్నా!
ఈసడింపులెన్నో తుంచుకొనొచ్చా కానీ
నీ చులకనభావాన్ని తుంచలేకపోతున్నా!
అడ్డంకులెన్నో తుడుచుకొనొచ్చా కానీ
నీ వౌనపు మసిని తుడవలేకపోతున్నా!
సమస్యలెన్నో సాధించుకొనొచ్చా కానీ
నీ మనసు మర్మాన్ని సాధించలేకపోతున్నా!
సమాజానికంతా సమాధానమ్తిన్నా కానీ
నీ చేతలకు సమాధానమివ్వలేకపోతున్నా!
నీవు నేను మనమనే బంధమే గానీ
నీకు నాకు మధ్య ఎంత అంతరం!
మొగుడనే సింహాసనం ఎక్కితే
అహమనే కిరీటం వచ్చి చేరునేమో!
కలిసిన జీవన ప్రయాణంలో
మనం కలవని రైలు పట్టాలమేనా!
కాసింత ప్రేమ ఇంధనం కలిపితేనే కదా
మనమనే మనుగడ సాగేది!
మనకు మనమే తప్పా వేరొకరు కాదనే
నిజాన్ని నమ్మితేనే కదా
మనదైన కుటుంబం విలసిల్లేది!
- పుట్టి గిరిధర్, 9491493170