S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరణశయ్య

వృద్ధాప్యంతో ఒంటరిగా మిగిలాను
చెట్టుకూ నాకూ పెద్ద తేడా లేదు!
మోడుబారి వౌనంగా నిలిచాను
మట్టికీ నాకూ పెద్ద తేడా లేదు!
అవసరానికి వాడుకొని,
అవసాన దశలో అసహ్యించుకుంటారు!
పీల్చి పిప్పి చేసుకొని,
చివరి దశలో చీదరించుకుంటారు!

నీడనిచ్చినన్ని నాళ్లు నిండుగా ఉన్నారు
ఆయువిచ్చినన్నినాళ్లు ఆసరాగా ఉన్నారు!
రాలిపోతున్న నన్ను ఊడ్చేసుకున్నారు
విరిగిపోతున్న నన్ను పోగేసుకున్నారు!

ఒక్కొక్కటిగా కొమ్మలన్ని వాడిపోతుంటే
ఒంట్లోని నరాలన్నీ నలిగిపోతుంటే!
ఒక్కొక్కటిగా వేర్లన్ని నీరుగారిపోతుంటే
ఒంట్లోని సత్తువంతా కరిగిపోతుంటే!
కాయమంతా కుంచించుకు పోతుంటే
దేహమంతా దహించుకుపోతుంటే
రాలిపోయే దశలో మరణఘోష!
అంతిమ దశలో ఆత్మఘోష!

పిందెనై పువ్వునై కాయనై పండునై
నిలువెల్లా నీడనై తనువెల్లా తనవారికై!
మరణశయ్యపై కన్నీటి మాటలు
ఎవరికీ కనబడవు, వినబడవు!
ఎక్కడో ఎవరో ఆప్తులు పిలుస్తున్నట్లు!
చూపులు ఇక్కడే, దృశ్యం ఎక్కడో
శరీరం ఇక్కడే ఆత్మ ఎక్కడో!
అస్పష్ట దృశ్యాలకు రూపం ఎక్కడో
అందని లోకానికి పయనం ఎప్పుడో!

-పుట్టి గిరిధర్ 9491493170