ఎగరని గాలిపటం
Published Saturday, 8 July 2017ఇంగ్లండ్‌లోని మోర్కేంబే తీరం గాలిపటాల పోటీలకు పెట్టింది పేరు. ఏటా జూన్‌లో ఈ పోటీలు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం పోటీల సమయం వచ్చినా గాలి అనుకూలంగా లేకపోవడంతో ఔత్సాహికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా అందమైన, విభిన్నమైన రూపాలతో గాలిపటాలను రూపొందించి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన కైటర్స్ ఇక్కడ వాటిని ఎగురవేయడం పరిపాటి. కానీ ఈసారి గాలి వారికి అనుకూలంగా లేదుమరి.