S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కందిరీగలకు భయమేస్తే...

ప్రమాదం పొంచి ఉందని తెలిసినా, భయపడినా కందిరీగలు ఒక రకమైన రసాయనాన్ని (ఫెరోమోన్) విడుదల చేస్తాయి. సమీపంలోని ఇతర కందిరీగలు దీని వాసన గమనించి ప్రమాదంలో చిక్కుకున్నవాటిని రక్షించేందుకు మూకుమ్మడిగా అక్కడికి చేరుకుంటాయి. శత్రువుపై దాడి చేస్తాయి. ఆడ కందిరీగలకు ఉండే ముల్లు పదేపదే కాటువేసినా ఊడిపోదు. అదే తేనెటీగల్లో ఒక ఈగ ఒకసారి కుట్టిన వెంటనే శత్రువుశరీరంపై ఆ ముల్లు ఉండిపోతుంది. ఉదరం, రెక్కల రూపురేఖల్లో కందిరీగలకు, తేనెటీగలకు తేడా తెలుస్తుంది. పాడైన చెట్ల బెరడును చీల్చి, పిప్పి చేసి కాగితపు పొరల్లా చేసి గూళ్లను ఏర్పాటు చేసుకోవడం వీటి ప్రత్యేకత. చలిని ఏమాత్రం తట్టుకోలేని కందిరీగలు గూళ్లను ఎంతో శ్రద్ధగా, భద్రంగా ఉండేట్లు నిర్మించుకుంటాయి. కొన్నిరకాల కందిరీగల విషం ప్రాణాంతకం కూడా.

- ఎస్.కె.కె. రవళి