S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూడో రకం వైరస్( స్ఫూర్తి)

‘నాన్నా! నా ఫ్రెండ్ నాకు ఇప్పుడే ఫోన్ చేశాడు. వాడు పంపిన ఇ-మెయిల్‌కి అటాచ్ చేసిన గేమ్‌కి వైరస్ ఉందిట. నేను దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. నా కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌ని అది నాశనం చేయచ్చేమో?’ అనూప్ భయంగా చెప్పాడు.
వెంటనే అనూప్ తండ్రి వాడి డెస్క్‌టాప్‌లో ఎవాస్ట్‌ని ఉపయోగించి వైరస్‌ని తీసేశాడు.
‘వైరస్ అంటే ఏమిటి? ఫ్లూ జ్వరాన్ని ఇచ్చేది అదే కదా?’ అనూప్ తమ్ముడు ప్రశ్నించాడు.
‘అవును. వైరస్ ఓసారి శరీరంలోకి వెళ్తే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది’
‘కంప్యూటర్‌లోకి ఎక్కిన వైరస్ కూడా దానికి ఫ్లూ జ్వరాన్ని ఇస్తుందా?’ తమ్ముడు మళ్లీ ప్రశ్నించాడు.
‘్ఫ్ల వైరస్ వేరు. కంప్యూటర్ వైరస్ వేరు. కంప్యూటర్‌లోకి ప్రవేశించిన వైరస్ ప్రోగ్రామ్స్‌ని తన అధీనంలోకి తీసుకుని కంప్యూటర్ సరిగ్గా పని చేయకుండా చేస్తుంది. వైరస్ మన శరీరంలో ఉన్నా, లేదా కంప్యూటర్‌లో ఉన్నా దాన్ని వెంటనే తొలగించాలి. లేదా ప్రమాదం. శరీరంలోది తొలగించటానికి మందు తీసుకుంటాం. కంప్యూటర్‌లోని వైరస్‌ని తొలగించడానికి ఏంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ని వాడతాం. మనుషులు, కంప్యూటర్ల ఆరోగ్యాలని పాడు చేసే వైరసే కాక మూడో రకం వైరస్ ఉందని మీకు తెలుసా?’ తండ్రి పిల్లలిద్దర్నీ ప్రశ్నించాడు.
‘తెలీదు. ఏమిటది?’ అనూప్ ప్రశ్నించాడు.
‘మైండ్ వైరస్. చెడ్డ ఆలోచన ఓసారి మనసులోకి ఎక్కితే అది మనసుని పాడు చేసి మనం చెడుగా ప్రవర్తించేలా చేస్తుంది’
‘ఆ వైరస్ ఎలా ప్రవేశిస్తుంది?’ అనూప్ తమ్ముడు అడిగాడు.
‘మనం చూసే వాటి ద్వారా, వినే వాటి ద్వారా, చదివే వాటి ద్వారా. అందుకనే వీటి విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలి’
‘కంప్యూటర్‌లోలా మైండ్ వైరస్‌ని తొలగించచ్చా?’ అనూప్ తమ్ముడు ప్రశ్నించాడు.
తండ్రి చిన్నగా నవ్వి తల ఊపి చెప్పాడు.
‘మనసుకి కూడా ఏంటీ వైరస్ ప్రోగ్రాం ఉంది. చేసిన తప్పుని ఒప్పుకోవడం, దైవ నామస్మరణ చేయడం వల్ల మనసు శుభ్రపడి వైరస్ తొలగిపోతుంది’
-డోంట్ ఇగ్నోర్

-మల్లాది వెంకట కృష్ణమూర్తి