S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైదిక కర్మలకు ఉత్తరాయణం విశేషం

ప్రశ్న: ‘ఆత్మాధికః కలాది భిర్న భోగస్సప్తానాం వాష్టానాంవా’ అని రాశారు. మరి అది ఎందులోనిది? దాని వివరములు తెలపండి.
-రామనాథశాస్ర్తీ ఎన్. (రాజమండ్రి)
జ: అవి జైమినీ సూత్రములు. ప్రారంభ సూత్రం. జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలిత నిర్ణయం విషయంలో పరాశరమతం, జైమినీ మతం రెండు విధానాలు ఉన్నాయి. వీటికి ఆధారం తొమ్మిది గ్రహాలు వాటి కారకత్వాలు, రాశులు, భావములు, వాటి కారకత్వములు. అన్నీ సమానమే. అయితే శోధనా మార్గం వేరుగా ఉంటుంది. ప్రారంభంలో వున్న కారకత్వములు, చివర్లో ఉండే ఫలితాంశములు ఒకటే. శోధనా మార్గమే భేదము. నేడు మనం వింటూన్న కె.పి. సిస్టమ్ కూడా అటువంటిదే. ఒక భావం శోధించేటపుడు ఆ భావంతో సంబంధం ఉన్న అన్ని రకములయిన గ్రహములను సిగ్నిఫికేటర్ అనే పేరుతో పిలిచి చివరకు వారికి నడుచుచున్న దశా అంతర్దశలకు సంబంధం నిర్ణయించి ఫలిత నిర్దేశం చేయడమే కె.పి. సిస్టమ్. అన్నీ శోధనా మార్గములు మాత్రమే భేదము. ఫలితములు మాత్రం ఏకము.
ప్రశ్న: జ్యోతిశ్శాస్త్ర, పురాణ విషయాలలో మాఘ మాసమునకు ఎందుకు విశిష్ఠ స్థానం ఇవ్వబడినది. మాఘ మాసం జాతక దోషాలు నిలువరిస్తుందా?
-కుప్పా లక్ష్మీనారాయణ (విజయవాడ)
జ: ‘దినేశచంద్రౌ నరపాలకాఖౌ’ రవి చంద్రులు జ్యోతిశ్చక్రమునకు రాజులు. అందులోను రోజూ ప్రత్యక్షంలో కనపడే గ్రహ గోళములు సూర్యచంద్రులు. వీరిరువురిలో శక్తివంతుడు సూర్యుడు. ఆయన కిరణ కాంతి ప్రభావంతో నక్షత్రములు గ్రహములు ప్రకాశింపబడుతున్నాయి. ఉత్తరాయణం వచ్చిన తరువాత యజ్ఞములు చేయుట మంచి కాలము. పౌరాణికంగా ఉత్తరాయణమే సమస్త పుణ్య కార్యములకు యజ్ఞములకు విశేషము. ఖగోళం ప్రకారం ఉత్తరాయణంలో సూర్యుడు ఉదయం తూర్పు ఈశాన్యములకు మధ్య జరుగుతుంది. మరి ఉపనయన వంటి వైదిక కర్మలకు ఉత్తరాయణం విశేషం. దానిలో ఆదిమాసము మాఘమాసము. ఇది సూర్యభగవానునికి ప్రీతి. పురాణాలలో కోణార్క దేవాలయము మరియు మాఘ మాస విశిష్టతలు చాలా చెప్పబడినవి. ఆరోగ్యప్రదాత శ్రీ సూర్య భగవానుడు. నిత్యం సూర్య ఆరాధన చేయువారికి ఎటువంటి సమస్యలు దగ్గరకు రావు అని పురాణ వచనం. సూర్యోదయ, సూర్యాస్తమయముల మధ్య నిదురించకుండా ఉండటం, సూర్యునికి ప్రీతి అయిన ఆదిత్య హృదయం వంటి స్తోత్రములు పారాయణ చేయడం, వేద మంత్రాలు ‘తృచ’ మహాసారం, అరుణం వంటివి వినడం ద్వారా మనకు గ్రహశాంతి చేకూరుతుంది. ఇతర గ్రహముల వలన వచ్చే చెడు ఫలితములు కూడా నిరోధింపబడుతాయి. రథసప్తమి స్వామికి చాలా ప్రీతికరమయిన రోజు. సూర్యుడే లేకపోతే గ్రహములు ఖగోళంలో దృగ్గోచరము కావు.
*

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336