S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కరువు తీరింది

ఎక్కడైతే ఏమి.. అవకాశాలు గుక్కతిప్పుకోకుండా వస్తే అంతకన్నా అదృష్టం ఏముంది? ఇన్నాళ్లూ అవకాశం ఒక్కటన్నా తలుపు తడుతుందేమోనని ఎదురుచూసి ఎదురుచూసి చివరికి ఒక్కసారిగా వచ్చిపడుతున్న హీరోయిన్ పాత్రలు కేథరీన్ థెరిసాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో ఆమె చేసిన ఓ చిత్రం టాలీవుడ్‌లో విడుదలైనా సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఓ వైపు అల్లు అర్జున్ వున్నా, మరోవైపు పూరి జగన్నాధ్ వున్నా ఆమె ఫేట్‌ను ఏ మాత్రం మార్చలేకపోయారు. ఆ తరువాత రెండు మూడు చిత్రాలు చేసినా అవి కూడా అంతంతమాత్రం కావడంతో తెలుగులో కేథరీన్ థెరిసా పేరు గల్లంతైంది. ఇక లాభం లేదని చెన్నై చెక్కేసిన ఈ భామ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మలయాళాన్ని కూడా వదలలేదు. చిన్నగా ఎలాగోలాగ కార్తితో చేసిన మద్రాస్ అనే చిత్రం హిట్ అవ్వడంతో అమ్మడి అదృష్టమే మారిపోయింది. తాజాగా విశాల్‌తో చేసిన కథకళి కూడా హిట్ బాట పట్టడంతో కేథరీన్ అదృష్టరేఖ తిరిగిపోయింది. దీంతో ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఎదగడానికి స్విమ్ చేస్తోంది. ఆమె చేతిలోనే మరో రెండు చిత్రాలు ఉన్నాయి. ఇదికాక మరో యువ హీరోతో కూడా ఇంకో చిత్రం ఉంది. ఈ మూడు చిత్రాల్లో ఒక్క చిత్రం హిట్ అయినా కేథరీన్ థెరిసా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ఇప్పటికే బిజీ హీరోయిన్‌గా మారినా, తెలుగును మాత్రం వదలలేకపోతోంది. ఎందుకంటే, భారీ రెమ్యూనరేషన్స్ ముందు చిన్న చిన్న పారితోషికాలు కనపడవు కదా. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసనే సరైనోడు అనే చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఏమో, కోలీవుడ్‌లో తిరిగిన అదృష్టరేఖ కేథరీన్‌కు తెలుగులో కూడా తిరుగుతుందేమో! వేచి చూద్దాం!!

అదీ ఓ భాగమే!
పరభాషా కథానాయికలు రాజ్యమేలుతున్న టాలీవుడ్‌లో డబ్బింగ్ చెబుతానంటూ మరో పరభాషా కథానాయిక ముందుకు వచ్చిందీ అంటే అది విశేషమే. అందులో ఇప్పటికే అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి హిట్లు అందుకున్న తమన్నా తాజాగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతానంటోంది. అయినా కానీ ఎవరూ పట్టించుకోవడంలేదన్న బాధ కూడా వ్యక్తం చేస్తోంది. తొలి సినిమా నుండి తెలుగుపై మక్కువ పెంచుకున్న తమన్నా పక్కాగా ఇప్పుడు తెలుగు మాట్లాడగలుగుతోంది. బాలీవుడ్ వెళ్లినా తెలుగులోనే మాట్లాడుతోందట. ఇదేంటి అని అడిగితే తనను హీరోయిన్‌గా గుర్తించింది టాలీవుడ్ కనుక తెలుగంటే తనకు ఇష్టమని, అది తన జీవితంలో ఓ భాగమంటోంది. అయితే ఇంత బాగా తెలుగును మాట్లాడగలిగిన తనను డబ్బింగ్ చెప్పమని ఎవరూ అడగలేదని, అడిగితే మాత్రం కచ్చితంగా చెబుతానంటోంది. మరి ఆ అవకాశం ఎవరిస్తారు?

ఏదైతే నాకేంటి?

ఒక్కసారి సెలబ్రిటీగా గుర్తింపు వచ్చిందీ అంటే, ఏది మాట్లాడినా అదొక సెనే్సషన్ అవుతుంది. అది గుర్తించే బాలీవుడ్ భామలు మరింత గుర్తింపు కోసం ఏదిబడితే అది చెప్పేస్తూనే వుంటారు. అది ఏదైతే నాకేంటి అన్న ధీమా వారిలో వుంటుంది. ఎందుకంటే, ఎంత సెనే్సషన్ క్రియేట్ చేస్తే అంత పేరు వస్తుందని వారికి తెలుసు. అందుకే అప్పుడప్పుడు అలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతూనే వుంటారు. విషయంలోకెళితే పరిణితి చోప్రా అప్పట్లో శృంగారం గురించి హాట్ హాట్ స్టేట్‌మెంట్లు ఇచ్చి వార్తల్లోకెక్కింది. ఆమె చెప్పిన మాటలకు యూత్ అంతా మళ్లీ ఏం చెబుతుందా అని చెవులు రిక్కించి మరీ విన్నారు. కొన్నాళ్లు అలా గడిచిపోయింది. మళ్లీ తన మాటల మాయాజాల మహిమ తగ్గిపోయిందనుకుందో ఏమో రీసెంట్‌గా కొత్త సంచలన ప్రకటనలు చేసింది. మహిళలు ఆ మూడు రోజులు అనేక కట్టుబాట్లల్లో వుండాల్సిన అవసరం లేదని, అయినా ఇటువంటి విషయాలను రహస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి నిశ్శబ్దాన్ని ఛేదించాలని, మనం అభివృద్ధి చెందిన దేశంలో వున్నామంటూ గుర్తుకూడా చేసింది. ఈ మాటలతో పరిణితి మరికొన్ని రోజులు లైమ్‌లైట్‌లో వుండడం గ్యారంటీ. అన్నీ తెలిసినవాళ్లు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇస్తూనే వుంటారు. అమాయకులు వింటూనే వుంటారు. అదంతే!

-సమీర్