S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముక్తకాలు

అన్నదాత కన్నీరు పెడితే
అరిష్టం దేశానికి
పండించే వాడి గుండె మండితే
పస్తులే జనానికి

నీవెన్ని
దేశాలైనా తిరుగు
కన్ననేలను గుండెలో పెట్టుకుంటూనే
నీ వెలుగు

టేస్ట్ చేసి డస్ట్‌బిన్‌లో
అన్నాన్ని పడేసేవాడు ఒకడు
అయ్యో పాపం!
ఆ అన్నానే్న ఏరుకుంటూ మరొకడు

కన్పించేదంతా స్వర్గం
అనుకుంటున్న వెర్రివాడా!
చంద్రునిలో కూడా
రాళ్లేనన్న సత్యం తెలుసుకోరా!

ఊకదంపుడు ఉపన్యాసాలకు
కాలం చెల్లింది
ఇవాళ ఎవరి చెవిలో పువ్వు పెట్టలేరు
కాలం మారింది
మానవతా విలువలు
మారవురా పిచ్చి తుగ్లకూ!
ఇలలో అవి శాశ్వతాలు
వెలిగే దీప శిఖలు
ఓటమి
గెలుపునకు సోపానం
ఇది తెలుసుకుంటే
ధైర్యంగా మెట్లెక్కగలం

అద్దంలో అందాన్ని చూచుకొని
మురిసిపోతున్న జవ్వనీ!
ఆ అద్దమే నిన్ను వెక్కిరిస్తుంది
ముసలితనం రానీ.

కాలం నన్ను మేల్కొల్పుతుంది
కావ్యం నాకు ఉపదేశమిస్తుంది
అందుకే కాలానే్న కావ్యంగా
నేను రచిస్తున్నది

వాడు దూరంగా కట్టుకున్న
అంతస్తుల మేడలో
ఏకాకిగా అశాంతిగా
వీడు జనం మధ్య వేసుకున్న
పూరిగుడిసెలో
సంఘ జీవిగా హాయిగా.
*

-డా.తిరునగరి 9705146705