S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వర మహాలక్ష్మి

ఆశ్రీత మందార నిరామయ తన్మయ
అమందానంద జగదానంద నిలయ
నిర్మల సౌభాగ్య సుధాంబుధి చంద్ర
మనోజ్ఞ మనోహర మానస బింబ
సువాసినీ సహిత సకల స్ర్తి కరుణాలాలస
సత్సమ్మోహన నిత్య సుమంగళీ వరప్రదాయిని
శ్రావణ సమీర సంకేత గగన పతాక
గంగా, కావేరీ, సింధు సమేత సర్వ నదీ సమన్వయాంతరంగ
మాతా, పిత సమ ఆశీర్వాద భరిత
భోగ, సౌభాగ్య సువర్ణ మహిత.

నిను పుష్పమాలాలంకృతను చేసి
అర్చించి, నైవేద్యమర్పించి,
వాయనమిచ్చి, నిను మెప్పించ
దివి నుండి కురిసేటి నీటిజల్లు
నీ కరుణారస బిందువులై
మా సౌభాగ్య సింధువులై
నీ దృక్కే మాకు దిక్కై
నీకు మ్రొక్కేము
వర మహాలక్ష్మీ వరందేహి నమో స్తుతే
నిరంతరం మంగళం, శుభమంగళం
*

-అనంత మురళీచంద్ర, ఎ.ఎస్.ప్రభాకర్ 9963887346