ప్రశ్నలు
Published Friday, 18 August 2017ప్రశ్నించాలని ఉంది
ఈ నవ నవీన సమాజాన్ని?
అసలు భగవంతుడు మనిషిని సృష్టించాడా?
లేక మనిషిని భగవంతుడు సృష్టించాడా?
జ్ఞానం వున్న మనిషి తప్ప
ఏ జీవి భగవంతుడిని తలవనప్పుడు?
ఏ జీవికి భగవంతుడు
అవసరం లేనప్పుడు?
భగవంతుడు ఎక్కడ పుట్టాడు?
మనిషి తలపులోనా?
భగవంతుడికి రూపాన్ని ఇచ్చిన పాపం
మనదే అనాలనిపిస్తుంది?
కులం కులం?
మతం మతం??
అజ్ఞానం వున్న మనిషి ఈ
కులాలను మతాలను సృష్టించాడా?
నీలో జ్ఞానం ఎప్పుడు పెరిగేనురా?!
ఓ మనిషి...?
కులం?
మతం??
భగవంతుడుని మరిచి
జ్ఞానంతో ఎప్పుడు నడుస్తావు??
*