S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రయాణం

మనిషి జీవితం ఓ ప్రయాణం లాంటిది. మరీ ముఖ్యంగా రైలు ప్రయాణం లాంటిది. దార్లో ఎన్నో స్టేషన్లు, ఎన్నో మలుపులు, రకరకాల మనుషులు, స్నేహితులు, అపరిచితులు ఇట్లా ఎంతోమంది తారసపడుతుంటారు.
ఎక్కడో పుడుతాం. అక్కడే చదువుకోవచ్చు. మరో ఊళ్లో చదువుకోవచ్చు. హైస్కూలు, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజీ, పీజీ, ఉద్యోగం, రకరకాల ప్రదేశాలు ఇట్లా ఎన్నో దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తాం.
మన పుట్టుకతో మన రైలు ప్రయాణం మొదలవుతుంది. మన తల్లిదండ్రులు మనతో ప్రయాణం కొనసాగిస్తారని అనుకొంటాం. కాని వాళ్లు ఎక్కడో దిగిపోతారు. ఎంతోమంది స్నేహితులని, వాతావరణాలని వదులుకుంటూ మనం ప్రయాణం కొనసాగిస్తాం. మన ప్రయాణంలో ఎంతోమంది కొత్త వ్యక్తులు వస్తూ వెళ్తుంటారు. కొంతమంది గుర్తుంటారు. మరి కొంతమందిని మనం మర్చిపోతాం.
వివాహం, పిల్లలు ఇట్లా ఎంతోమంది మనతో ప్రయాణం కొనసాగిస్తారు. పిల్లలు పెద్దవాళ్లై అమెరికాకో, ఆస్ట్రేలియాకో వెళ్లిపోయి ఒకరకమైన ఖాళీని ఏర్పరుస్తారు.
కొంతమంది మిత్రులు, బంధువులు, అన్నాచెల్లెళ్లు అకస్మాత్తుగా అదృశ్యమవుతారు. మరి కొంతమంది మన దృష్టిలోకి రాకుండానే తమ సీట్లను ఖాళీ చేస్తారు. కొంతకాలానికి గానీ వాళ్లు తమ సీట్లను ఖాళీ చేసిన సంగతిని మనం గుర్తించం.
ఈ జీవిత ప్రయాణం సంతోషం, కేరింతలు, హాల్లోలు, గుడ్‌బైలు, విషాదాలు, విజయాలు, అపజయాలు ఇట్లా ఎన్నో.
మన స్టేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ ఎప్పుడో వస్తుంది. మన జీవిత ప్రయాణం గమ్యం లేనిది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అందుకని సాధ్యమైనంత వరకు ప్రేమని పంచాలి.
మంచి జ్ఞాపకాలని మిగల్చాలి. క్షమించాలి. కాసింత కరుణని కురిపించాలి. మన ప్రయాణం తరువాత ప్రయాణం కొనసాగించే వ్యక్తులు మనలని గుర్తుకు తెచ్చుకునే విధంగా మనం ప్రయాణం కొనసాగించాలి.
ప్రయాణంలో అన్నింటికన్నా ముఖ్యమైంది కృతజ్ఞత. మన ప్రయాణానికి సహకరించిన వ్యక్తులకి ఎప్పుడూ కృతజ్ఞతని వ్యక్తపరచాలి.
గుర్తుపెట్టుకునేది మన జ్ఞాపకాలు.
అవి అందంగా ఉండాలి.
ఆకర్షణీయంగా ఉండాలి.

జింబో 94404 83001