S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చెలిమె

కొంతమంది రచయితలు విరివిగా రాస్తూ ఉంటారు. మరి కొంతమంది తక్కవగా రాస్తూ ఉంటారు.
చిత్రకారులూ అంతే!
కొంతమంది రోజూ బొమ్మలు వేస్తూ ఉంటారు. మరి కొంత తమకు ఇష్టమైనప్పుడు వేస్తూ ఉంటారు.
ఎక్కువ రాయడానికి, అతి తక్కువ రాయడానికి ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు.
ఒకటి మాత్రం నిజం. చాలా రోజుల తరువాత రాయడం మొదలుపెట్టినప్పుడు అంత సులువుగా కలం ముందుకు నడవదు. చిత్రకారులకి కూడా ఇలాగే ఉంటుంది.
చాలామంది రచయితలను చాలామంది పాఠకులు ఓ ప్రశ్న వేస్తూ ఉంటారు.
‘రాయడానికి మీకు ఉత్సాహం కలిగించేది ఏమిటీ?’
ఒక్కో రచయిత ఒక్కో రకంగా సమాధానం చెబుతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది రాయడానికి నాకు తోడ్పడుతుందని ఒకరు, మంచి సంగీతం విన్నప్పుడు రాయాలని కోరిక కలుగుతుందని మరొకరు జవాబు చెబుతుంటారు. ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు ఉత్సాహం కలిగి రాస్తానని మరి కొందరు చెబుతుంటారు.
ఇలా ఒక్కో రచయిత ఒక్కో రకమైన సమాధానం చెబుతారు. అవి నిజం కావొచ్చు. కాని గాయకుల విషయంలో అలా ఉండదు. నాకు తెలిసి వాళ్లు రోజూ సాధన చేస్తూ ఉంటారు.
రచయిత కూడా రోజూ సాధన చేయాలి. కానీ ఈ విషయంలో చాలామంది ఏకీభవించరు. రోజూ రాస్తే అది పేలవంగా ఉంటుందని ఒకరు; అందులో జీవం ఉండదని మరొకరు వాదిస్తూ ఉంటారు.
మనకు ఒక ఆలోచన వస్తే దాన్ని కాగితం మీద సాధ్యమైనంత త్వరగా పెట్టాలి. అలా పెట్టకపోతే అది కరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం చాలామంది అంగీకరిస్తారు. కథా రచయితలు చాలామంది సంగ్రహంగా దాన్ని తమ డైరీలో నమోదు చేసి పెట్టుకుంటారు. తరువాత ఎప్పుడో దాన్ని రాస్తారు. ఇది కొంత బెటర్.
మనకి అప్పుడే ఆలోచన వచ్చినప్పుడు రాస్తే అది చాలా తాజాగా ఉంటుంది. అయితే దాన్ని అప్పుడే ప్రచురించాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల తరువాత దాని సరిచేయవచ్చు. అనవసర పదాలను తొలగించవచ్చు.
మన ఆలోచనలని అప్పుడే కాగితం మీద పెట్టకపోతే ఆ ఆలోచనకి అయిన తాజాదనం రాదు.
రచయితలను గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు వాగుల్లోని ‘చెలిమె’ గుర్తుకొస్తుంటుంది.
‘చెలిమె’లని వాగుల్లో తయారుచేస్తారు. అందులో మంచినీరు వస్తుంది. నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరును వాడుకున్నప్పుడల్లా కొత్త నీరు వూరుతూ ఉంటుంది. నీటిని వాడుకోనప్పుడు ఊట ఉండదు. నిలిచిపోతుంది. నీళ్లు రావు.
రచయితలకు ఈ చెలిమె బాగా వర్తిస్తుంది. వారి ఆలోచనలని కాగితం మీద పెట్టకపోతే కొత్త ఆలోచనలు రావు. అట్లాగే స్తబ్దత వస్తుంది.
ఇది ఓ రచయితలకు సంబంధించింది మాత్రమే కాదు. అందరికీ సంబంధించినది. అందరికీ వర్తిస్తుంది.
మన పనులు, బాధ్యతలు వెంటవెంటనే నిర్వర్తించకపోతే ఇట్లాంటి స్తబ్దతే వస్తుంది.

జింబో 94404 83001