S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్తరూపు?!

దిల్లీ నగరం నడిబొడ్డున పార్లమెంట్ భవనాన్ని చూస్తే ప్రతి భారతీయుడి మనస్సు ఉప్పొంగిపోతుంది.. ఠీవిగా, దర్పం వొలకబోస్తూ పరిఢవిల్లిన ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.. అంటూ సాగిన ‘ప్రజా దర్బారుకు కొత్త రూపు?’ ఈ వారం స్పెషల్ ఆలోచింపజేసేదిగా ఉంది. భవనం పాతదై పోతుంటం, కార్యాలయాలు విస్తరించడం, సిబ్బంది పెరిగిపోవడం, భవనంపై భారం పడటం వల్ల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనేది సరైన కారణమే అయినప్పటికీ - ఆ ప్రాచీన కట్టడాన్ని ముందు తరాలకు ‘స్ఫూర్తి’ని అందించేందుకు అలాగే ఉంచి.. మరో కొత్త భవనానికి రూపకల్పన చేస్తే బావుంటుంది. ఆ భవంతిని పడగొట్టడం అన్నది సరైన ఆలోచన కాదు. ఇక ‘సండే గీత’ గురించి చెప్పనక్కర్లేదు. ఈ వారం ‘పెన్సిల్’ గురించి చెబుతూ - పెన్సిల్ రాసిన కొద్దీ తరిగిపోతుంది. కానీ మనిషి ఏమీ రాయకపోయినా ఏమీ చేయకపోయినా జీవితం తరిగిపోతూ ఉంటుంది అంటూ చక్కటి సందేశాన్ని అందించారు.
-పట్నాల సూర్యనారాయణ (రాజమండ్రి)
వలస బ్రతుకులు
ఈ వారం ‘నమ్మండి ఇది నిజం’ చదువుతూంటే నిజంగానే ఎంతో ఆశ్చర్యం వేసింది. పొట్ట చేతబట్టుకొని అనేక సంవత్సరాలుగా వేల మైళ్ల దూరంలోని ఇటలీకి వేల సంఖ్యలోని యువకులు తమ భార్యలని వదిలి, సంపాదన కోసం వలస వెళ్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాం. అలాగే ‘సండే గీత’ ద్వారా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తోంది. చిన్నతనంలో ఒక్క మెతుకు కిందపడితే అమ్మానాన్నలు కసురుకునేవారు. ‘ఆ మెతుకులు కూడా దొరకని వారెందరో ఉన్నారంటూ’ చెప్పేవారు. ఇప్పుడు బఫే సిస్టమ్ వచ్చింత్తర్వాత బకెట్ల కొద్దీ ఆహార పదార్థాలను వీధుల్లో పడేస్తున్నారు. అలా ‘వేస్ట్’ చేయద్దని చెప్పేవారే కరవయ్యారు.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
రణక్షేత్రం
వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న సీరియల్ ‘రణక్షేత్రం’. ఈ వారం హీరోయిన్ జీవితం వెనుక జరిగిన అవమానాలను చదువుతూంటే కన్నీళ్లొచ్చాయి. అదొక రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే ఇటువంటివి తప్పనే తప్పవు కదా అనిపించింది. ఇక ‘గమ్యం’ చేరాలంటే.. వ్యాసం బాగుంది. పలువురు మీ గురించి ఒకే రకమైన వ్యతిరేక ధోరణితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుని పయనిస్తున్న మార్గంపై దృష్టిని నిలిపి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలన్నది అక్షర సత్యం. ఇక మిగతా శీర్షికలు బాగుంటున్నాయి.
-గుండు రమణయ్య (పెద్దాపూర్, కరీంనగర్)
వినదగు
వారం వారం మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శీర్షిక ‘వినదగు’. గీతా సారాంశాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ - ‘్భగవద్గీత’లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. స్పిరిట్యులిజమ్ పరంగా మనల్ని మనం ఉద్ధరించుకోవటం అంటే మానవ సంక్షేమాన్ని కాంక్షించటం.. హిత స్వభావమే ఆత్మ పరిణతికి హేతువు కావటం.. సహ జీవన సౌభాగ్యాన్ని అనుభవించటం. నిజానికి ఆత్మ జాగృతమయ్యేది హిత కాంక్షతోనే. అంటే మానవ తత్వాన్ని త్యజించి కేవలం దివ్యత్వం వెంటపడ్డా ఆత్మజ్ఞత సాధ్యం కాదు. షట్చక్ర సాధన ఎంత అవసరమో గీతను జీవన గీతగా మలచుకోవటంలోనూ ఈ అధ్యాయ ఆకళింపు, ఆచరణ, సాధన అంతే అవసరమని తెలుసుకొన్నాం. ‘సండే గీత’లో ఉదయాన్ని సాయంత్రాన్ని అనుభవించండి అని చక్కగా చెప్పారు. నిజమే. ‘పెన్సిల్’లో చెప్పినట్లు మన సృష్టి మన చేతుల్లో లేదు.
-డి.వి.తులసి (రామవరప్పాడు, విజయవాడ)
ఓ చిన్న మాట
‘ఓ చిన్న మాట’గా చెప్పిన ‘కలగనండి.. సాధించండి.. కృతజ్ఞతతో ఉండండి’ అన్న సందేశం చాలా బాగుంది. ‘కత్తుల వంతెన’ కవిత బాగుంది. మనసు పగిలి మనిషి కదిలి భూకంపం వస్తూ పోతూ ఉంటుంది. కుంగుతున్న నేల మీద కూలిపోకుండా చేయి పట్టుకుని విడిపోని నీడలా నా వెంట సాగుతుంది.. అంటూ చక్కటి ముగింపు నిచ్చారు. అలాగే ‘సర్వాంతర్యామి’ కథ మా ఇంటిల్లిపాదినీ అలరించింది. ఎంతో ముచ్చటపడి - మొక్కు తీర్చుకొందామనుకున్న వృద్ధ దంపతులకు - కొడుకు మాటలు బాధ కలిగిస్తాయి. ఈ రోజుల్లో విదేశీ మోజు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందో ఈ కథ ద్వారా తెలుస్తోంది.
-శాంతిసమీర (వాకలపూడి)
పరిష్కారం
నల్లధనం సమస్యకు పరిష్కారం ఈ పార్టీల వల్ల కాదు అన్నారు. అది కొంతవరకు నిజమే. కానీ అసలు సమస్య - అంతర్జాతీయ చట్టాల జటిలత్వం, మన న్యాయస్థానాలూనూ. దశాబ్దాల తరబడి ‘విచారణ’ జరిపి కేసు ఫైలు చేస్తే నిందితులకు న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చేస్తున్నాయి. బెయిల్‌పై బయటకొచ్చిన అవినీతిపరుడు ప్రజలకు సుద్దులు చెప్తూంటే ఆ ప్రజలు జయజయ ధ్వానాలు చేస్తున్నారు. మన దేశంలో ఇదో విచిత్ర పరిస్థితి. ‘దిల్లీ బై హార్ట్’ పుస్తకం చదవకుండానే గోపాలంగారు రాసిన సమీక్ష కాని సమీక్ష సస్పెన్స్ కథలాగ సాగి సస్పెన్స్‌తోనే ముగిసి ఆకట్టుకొంది.
-జె.జ్ఞానబుద్ధ (సిద్దార్థనగర్, తూ.గో.జిల్లా)
సర్వాంతర్యామి
ఈ వారం కథ ‘సర్వాంతర్యామి’ మాకెంతో నచ్చింది. విదేశాల్లో ఉంటున్న పిల్లలు.. దేశంలో ఎదురుచూసే తల్లిదండ్రులు.. పిల్లల అచ్చటా ముచ్చటా తీర్చాలన్న తాపత్రయం.. వారిని చూడలేక పోతున్నామన్న బాధ.. సెంటిమెంట్ -ఇలా అన్నింటినీ టచ్ చేశారు. ఏడుకొండల వాడి మొక్కు కోసం తల్లి ఎదురుచూస్తూంటే.. విదేశాల్లో ఉన్నవారు రావటం కుదరక.. అక్కడే శాస్త్రోక్తంగా జరిపించామంటూ చెప్పటం - కన్నీళ్లు తెప్పించింది.
-పి.ఎస్.నారాయణ (రాజమండ్రి)