S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరక్షరాస్యులు

నిరక్షరాస్యులు రెండు రకాలుగా ఉంటారు. చదువుకున్న నిరక్షరాస్యులు. చదువుకోని నిరక్షరాస్యులు. చదువుకున్న నిరక్షరాస్యులు బాగా చదవగలరు. బాగా మాట్లాడగలరు. కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడరు. మార్పుని త్వరగా ఆమోదించరు.
ప్రపంచం సత్వరంగా మారిపోయింది. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో మార్పుని ఆమోదించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలి.
ఈ మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. గత సెప్టెంబర్ వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జారీ చేసిన చెక్కులని వాళ్లు ఆమోదించారు. ఆ తరువాత నుంచి వాటిని ఆమోదించడం మానేశారు. అందరికీ కొత్త చెక్కు పుస్తకాలని వాళ్లే పంపిస్తే బాగుండేది. దాని కోసం కోరిన వాళ్లకే పంపిస్తామని చెప్పారు. కోరిన వాళ్లకి కూడా అంత త్వరగా పంపించలేదు.
సాంకేతికతని బాగా ఉపయోగించుకోని వ్యక్తులకి దీనివల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి.
నా అకౌంట్‌లో డబ్బులు వున్నాయి. ఒక వ్యక్తికి నేను డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. చెక్కు ద్వారా చెల్లించడమే నేను చాలా రోజులుగా చేస్తున్న పని.
బ్యాంక్ అధికారి చెక్కు కావాలని అడిగాడు. వోచర్ ద్వారా పంపించమని కోరితే ముందు కుదరదని అన్నాడు. కాస్త గట్టిగా మాట్లాడిన తరువాత డబ్బులు బదిలీ చేశాడు.
ఆన్‌లైన్ లావాదేవీలకి నేను అలవాటు పడితే నాకు ఈ ఇబ్బంది ఏర్పడకపోయేది. నేను బదిలీ చేసేవాణ్ని.
చదువు వచ్చి నిరక్షరాస్యునిగా నేను మారిపోయాను.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే కొన్ని విషయాలని నాలాంటి వాళ్లు గుర్తుంచుకోవాలి.
నేర్చుకోవాల్సిన ఆవశ్యకతని గుర్తుంచుకోవాలి. ఈ తపన లేకపోతే కొత్త ఆలోచనలు రావు. కొత్త విషయాలు నేర్చుకోవడం కొంత ఇబ్బందిగా వున్నా నేర్చుకోవాలి.
నేర్చుకునే క్రమంలో క్రమశిక్షణని పాటించాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది - నేర్చుకోవడంలో ఇవి ముఖ్యమైనవి.
* సమాచారాన్ని బాగా అర్థం చేసుకోవాలి. * అనుభవంలోకి తెచ్చుకోవాలి * ఫీడ్‌బ్యాక్ చూసుకోవాలి. * ఇతరుల చర్యలని పరీక్షించాలి.
* అవసరమైన నోట్స్‌ని రాసుకోవాలి.
మనం అక్షర జ్ఞానులుగా వుందామా? అక్షరం వచ్చి నిరక్షరాస్యులుగా ఉందామా?
అది మన చేతిలో వుంది.

- జింబో 94404 83001