S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీటికి పువ్వులు అంటే ఇష్టం

ఐరోపాలోను, ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని పరిమిత ప్రాంతాలలోను కన్పించే ఎలుకజాతి జీవులు ఇవి. వీటిని ‘డొర్‌వౌస్’ అని పిలుస్తారు. ఫ్రెంచ్ భాషలో ‘డొర్‌మిర్’ అన్న పదం నుంచి దీనికి ఈ పేరు వచ్చింది. ‘నిద్రపోవడం’ అన్న అర్థంతో దీనికి ఆ పేరు వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే తన జీవితకాలంలో ఇది ఎక్కువభాగం ‘సుషుప్తావస్థ’లో గడిపేస్తుంది. ఒక్కోసారి ఆ అచేతన అవస్థలోనే ప్రాణాలు విడుస్తుందికూడా. అర అంగుళం నుంచి ఏడు అంగుళాల పరిమాణం వరకు పెరిగే వీటికి పెద్దపెద్ద నల్లకళ్లు, చిన్ని చెవులు, శరీరంకన్నా పొడవైన తోక ఉంటాయి. ఇవి చెట్లపైనే జీవిస్తాయి. పూలు, వాటిలో ఉండే తేనె వీటికి ఇష్టం. అందుకే అవి తరచూ వివిధ రకాల చెట్లపై పూలను తింటూంటాయి. వాటివల్ల ఫలదీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. సుషుప్తావస్థకు చేరుకోవడానికి ముందు విపరీతంగా ఆహారాన్ని తీసుకుని కొవ్వును శరీరంలో నిల్వ చేసుకుంటుంది. గుండ్రని బంతి ఆకారంలో ఇవి తమ గూళ్లలో చుట్టచుట్టుకుని నిద్రకు ఉపక్రమించి దాదాపు ఏడు నెలలపాటు అలా గడిపేస్తాయి.

- ఎస్.కె.కె. రవళి