గుమ్మడి వెలుగు!
Published Saturday, 28 October 2017న్యూయార్క్‌లోని క్రొటన్ అండ్ హడ్సన్ ప్రాంతంలోని నదీతీరంలో ఏటా జరిగే ‘గ్రేట్జాక్ ఒ’లాంటర్న్ బ్లేజ్’ వేడుకలు జరగడం ఆనవాయితీ. దాదాపు 7వేల గుమ్మడి పండ్లను కళాఖండాలుగా తీర్చిదిద్ది వాటికి వెలుగదివ్వెలను అమర్చి అద్భుత కళాకాంతులు వెదజల్లేలా చేయడం ఈ వేడుకలో భాగం. విచిత్ర వేషధారణలు, వివిధ చిత్రాలు, సీరియల్స్‌లోని పాత్రలు, దెయ్యాలు, భూతాల రూపాల్లో వీటిని తీర్చిదిద్ది ప్రదర్శించడం ఈ వేడుకలో ఆకర్షణ. అలా దీపకాంతితో మెరిసిపోతున్న గుమ్మడిపండ్ల పజిల్ ఇది.