S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ చిన్న తేడా...!

పుట్టుకలో తేడా ఉండదు
విభిన్న ఆలోచనా దృక్పథాల నుండి
అమలయ్యే ఆశయాల్లో
ఉంటుంది తేడా..!

లక్ష్యాలలో తేడా ఉండదు
ఆ లక్ష్యాన్ని సాధించటానికి
వ్యక్తులు ఎన్నుకునే మార్గాల్లో
ఉంటుంది తేడా..!

ఉద్యమాల్లో తేడా ఉండదు
ఊపిరి పోయినా విజయం
సాధించే వరకూ వెనుకకు
తగ్గని విలువల్లో ఉంటుంది తేడా..!

జీవితపు గమనంలో తేడా ఉండదు
బ్రతికే బ్రతుకు తనకే
కాకుండా పది మందికీ
ఉపయోగపడాలనుకునే
ఆకాంక్షలో ఉంటుంది తేడా..!

ఆ చిన్న తేడాలో సంచలనాలు
కలిగిస్తాయి
ఆ చిన్న తేడాలో ప్రభంజనాలు
సృష్టిస్తాయి..!!

-నసీమా