గాలి
Published Saturday, 28 October 2017బ్రతకాలంటె శ్వాసించాలి
శ్వాసించాలంటె కావాలి గాలి
గాలి బ్రతుకులు మనవి
గాలికి లేదు స్ర్తి పురుష భేదం
గాలి లేకుంటె లేదు జీవం
పుట్టేటప్పుడు కావాలి గాలి
పోయెటప్పుడు పోయేది గాలి
ప్రాణం కలిసేది గాలిలో
దేహం కలిసే మట్టిలో
గాలి మన ప్రాణం
గాలి మన గానం
గాలి మన నాదం
గాలి విలువ తెలుసుకో
గాలి దేవుడని తెలుసుకో.