S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కస్సు-బుస్సు! (‘క్లాప్’కొట్టు గురూ!)

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ ఎవరిమీద పడితే వారిమీద కస్సు..బుస్సుమంటోందిట! కారణం లేకపోలేదు. తనను కలిసిన ప్రతీసారీ తనపై వచ్చే రూమర్స్ గురించే ప్రశ్నలు గుప్పించడం ఆమె జీర్ణించుకోలేకపోతోందిట. ఇంతకీ విషయంలోకి వెళితే.. ఇంతకాలంగా ప్రేమాయణం నడుపుతోన్న బాలీవుడ్ జంట కత్రీనాకైఫ్-రణబీర్‌కపూర్‌లు విడిపోవడానికి సిద్ధంగా వున్నారట. దీనికి కారణం మరో బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనేనట. అవునా..ఇది నిజమా? అని కత్రీనాను ఎవరైనా కదిలిస్తే కస్సుబుస్సుమంటూ అడిగిన ప్రతీ ఒక్కరిపై మండిపడుతోందిట. తాజాగా రణబీర్-దీపికా చిత్రం ‘తమాషా’ ద్వారా వీరిద్దరూ దగ్గరయ్యారని బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే కత్రీనా.. రణబీర్‌పై వున్న కోపంతో ‘్ఫతూర్’ చిత్రంలో ఆదిత్యరాయ్ కపూర్‌తో రెచ్చిపోయి నటించిందట. ఇంతకాలం కత్రీనా-రణబీర్‌లు కలిసి వుంటున్న ప్లాట్‌లో ఇప్పుడు కత్రీనా ఒక్కతే ఒంటరిగా వుంటోందిట. అదీ..అసలు విషయం. ‘‘బాలీవుడ్ భామలపై ఇలాంటి రూమర్స్ మామూలే. ఇవన్నీ పట్టించుకుంటే కెరీర్ ఇక అటకెక్కినట్టే’’అంటూ ఇలాంటి వాటిని తెలివిగా కొట్టిపారేస్తుంది కత్రీనాకైఫ్! మరి కైఫా.. మజాకా!!

గ్లామర్‌పై మోజు!

అందాలభామ కాజల్ అగర్వాల్ ఇక గ్లామర్‌తో రెచ్చిపోవాలనుకుంటుందిట. అందులో భాగంగానే తాజాగా నటిస్తున్న బాలీవుడ్ సినిమాల్లో తన ఒయ్యారాలతో చిందులు వేయడానికి రెడీ అవుతుందట. అంతే కాదు ఈ మధ్య ఏ ఫంక్షన్‌కి వెళ్లినా గ్లామర్ దుస్తులతో తెగరెచ్చిపోయి ఫోజులిస్తుందట. ఇందులో నిజమెంతుందోనని కాజల్‌ని కదిలిస్తే-‘‘గ్లామర్‌గా కనిపించడంలో తప్పేం లేదనుకుంటా. ఏ హీరోయిన్ అయినా గ్లామర్ చిందించక తప్పదు. ఇప్పుడు నేనూ అలాగే చేస్తున్నాను. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏవుడ్ తీసుకున్నా హీరోయిన్ అన్నప్పుడు అన్ని పాత్రలూ చేయాలి. అలా చేసినప్పుడే మన ఫవరేంటో తెలుస్తుంది. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే ఈ మాత్రం చేయాల్సిందే. ఇందులో ఎవ్వరేమనుకున్నా నేనేమీ పట్టించుకోను. దట్సాల్..!!’’అంటూ కాజల్ తన మనోగతాన్ని విప్పింది. దటీజ్..కాజల్!!

ప్చ్..కంగనా!!
‘‘ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతూ రంగుల రాట్నంలో విహరించాలని కలలుగనే వెండితెర భామలకు తొలి నాళ్లలో అవస్థలు తప్పవు. అన్ని రకాలుగా వేధింపులే..! అయితే వాటిని తట్టుకుని నిలబడగలిగినప్పుడే కెరీర్ సాఫీగా సాగుతుంది’’అంటోంది అందాలభామ కంగనారనౌత్ ఎంతో అనుభవంతో. అయితే ఆ అవస్థలనేటివి రకరకాలుగా వుంటాయి. ముఖ్యంగా కెరీర్ తొలినాళ్లలో ఇవి మామూలే. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటి కోకొల్లలే. కంగనాకు కూడా ఇలాంటివి లెక్కలేనన్ని అనుభవాలుఎదురయ్యాయట. అయితే వాటిని తనేమీ లెక్కచేయలేదట. అందుకే ఇవ్వాళ ఇలా వున్నానంటోంది. ప్రస్తుతం కెరీర్‌లో మంచి మంచి సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించిన కంగనాకు ఇప్పటికీ ఇష్టమైన పాత్ర లభించనేలేదట. ఇకపై కెరీర్‌లో మరింత ఆచి తూచి అడుగేస్తానంటోంది. ప్చ్..కంగనా!!

-సమీర్