S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాల్‌పాయింట్ పెన్ కనిపెట్టిందెవరు?

హంగేరియన్ ఎడిటర్ లాస్‌జ్లో బైరో అనే ఆయన తొలిసారిగా బాల్‌పాయింట్ పెన్‌ను కనిపెట్టారు. పత్రికలో వాడే ఇంక్ త్వరగా ఆరిపోయి, చెరగకుండా ఉండేలా చూడటం, త్వరగా రాయడానికి ఉపకరించేలా ఉండటం అన్న ప్రయోజనాల కోసం ఆయన ఈ బాల్‌పాయింట్ పెన్‌ను ఆవిష్కరించారు. బాల్‌పాయింట్ పెన్‌లో వాడేందుకు ఉపయోగపడే ఇంక్‌ను తయారు చేసేందుకు బైరో సోదరుడు గ్యోర్గి సహకరించారు. ఆయన రసాయన శాస్త్రం లో నిపుణుడు. ఆ ఇద్దరూ కలసి బాల్‌పాయింట్ పెన్‌ను సృష్టించారన్నమాట. 1930లో వారు దీనిని కనిపెట్టారు. పెటెంట్ కోస్ ఎన్నోమార్లు ప్రయత్నించి సాధించారు. 1945లో ఆ హక్కులను మార్సెల్ బిక్చ్‌కు విక్రయించారు. ఆ తరువాత బిక్చ్ తన పేరును కుదించి ‘బిక్’ పేరుతో పెన్నుల తయారీ, విక్రయాలను ప్రారంభించి ఆ రంగంలో ప్రముఖ స్థానం సాధించారు.

- ఎస్.కె.కె. రవళి