నానీలు...
Published Saturday, 18 November 2017తాతల నాటి
సేంద్రియ సేద్యం
చద్దన్నం మూట
జలపాతం
ప్రకృతి నిర్మించిన
అద్భుత కట్టడం
కలప శిల్పి
వడ్రంగి కొంపలో
కత్తి ‘పీట’ కరువు
చావు
మనిషిగా ఒకసారి
జాతిగా రెండోసారి
పీక కోసినా
గడ్డి చావదు
పశువుల కోసం
దీపావళి యుద్ధం
టపాసుల
ఛిద్ర కళేబరాలు
స్టేజి ఆర్టిస్టుల
దాహం తీర్చేది
చప్పట్ల వర్షం
ప్రియురాలా
నువ్వు లేనప్పుడు
కాలాన్ని ఆగమను.