S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అబ్బురపరిచే కాగితం కళాకృతులు(లోకం పోకడ)

మోహిత్ లఖానీ ఢిల్లీకి చెందిన నైపుణ్యవంతుడైన డిజైనర్. అంతే కాకుండా అతను చక్కని చిత్రకారుడు కూడా. అతను పేపర్‌తో ఎన్నో అందమైన ఆకృతులకు జీవం పోసాడు. ఇన్ఫోగ్రాఫిక్, మోషన్ ఇన్ఫోగ్రాఫిక్, డాటా విజువలైజేషన్, కాంటెపరరీ ఆర్ట్, ఫొటోగ్రఫీల్లో నిష్ణాతుడైన లఖానీ పేపర్ స్కల్పచర్ ప్రక్రియలో అందె వేసిన చేయిగా పేరు గడించాడు. అతను తయారు చేసిన పూర్వ అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పేపర్ స్కల్పచర్ ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ ప్రక్రియకు అతను ఏకంగా అయిదు వందల పేపర్ ముక్కలను వాడాడు. ఎంతో ఓపిగ్గా, పట్టుదలతో ఈ రూపాన్ని అతను ఆవిష్కరించాడు. నిజానికి పేపర్ స్కల్పచర్లను తయారు చేయాలంటే అదేమంత సులువైన పని కాదు. దానికి ఎంతో నైపుణ్యం, ఓపిక, ఆర్టిస్టిక్ వ్యూ ఉండాలి. లఖానీ ఈ ప్రక్రియల్లో నిష్ణాతుడు కనుక అతను ఈ విద్యలో శిఖరాగ్రానికి చేరుకుని అందరి చేతా సెహభాష్ అనిపించుకుంటున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖుల పేపర్ స్కల్పచర్లను తయారు చేయడానికి ముందు లఖానీ ముందుగా కంప్యూటర్‌లో బ్లూప్రింట్ తయారు చేసుకుంటాడు. ఆ బ్లూప్రింట్ తాను రూపొందించబోయే ఆకృతిలో ఎక్కడ ఏ పేపర్ పీస్ రావాలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది కనుక దాని ప్రకారం ఆకృతి ఇట్టే ఆవిష్కృతమవుతుంది. అతను ఇప్పటి వరకు ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ నాయకులు, సినిమా స్టార్లతో పాటు ఇళ్లు, కార్లు, జంతువులు, యుద్ధ
ట్యాంకుల వంటి ఎన్నో ఆకృతులను రూపొందించాడు. అతను పేపర్ ముక్కలు, జిగురు వంటి తేలికపాటి సాధనాలతో తయారు చేసే ఈ ఆకృతులకు మన దేశంతో పాటు దేశ విదేశాల్లో కూడా ఎంతో పేరుంది. అతని టాలెంట్‌ని ప్రపంచ ప్రఖ్యాత పత్రిక ఫోర్బ్స్ కూడా కొనియాడింది. జపనీస్ పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ ఓరిగామీ నుండి తాను స్ఫూర్తి పొంది ఈ రంగంలో కృషి చేస్తున్నట్లు లఖానీ చెబుతున్నాడు. ఈ విధంగా పేరు తెచ్చుకుంటున్న లఖానీ ఎప్పటికైనా పేపర్ స్కల్పచర్ ఆర్ట్ మ్యూజియంను ఏర్పాటు చేయాలనేదే తన ధ్యేయమని చెబుతున్నాడు. అందులో తనవే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆర్టిస్టుల పేపర్ స్కల్పచర్లను పొందుపరచాలని ఆశిస్తున్నాడు. టెక్నాలజీ, రా, హ్యాండ్‌మేడ్ స్కిల్స్ వంటివి తన నైపుణ్యంలో చూపించే లఖానీ ఎంజిఎల్ ఇన్ఫోగ్రాఫిక్స్ పేరిట సొంతంగా ఒక సంస్థను నడుపుతున్నాడు.

- దుర్గాప్రసాద్ సర్కార్