S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కష్టాల సుడిలో..

రెక్కలు విప్పని శాబకం
రెమ్మపై పడి
రెపరెపలాడినట్టు
పాలందక గిలగిలలాడే
పసివాడి గోల
వెలుగని పొయ్యిలో
ఎలుకల సందడి
పూనకం వచ్చిన గాలికి
పూలరెమ్మ లెగిరినట్టు
కమ్మల గుడిసెలో
నిమ్మలం లేని కాపురం
పట్టెడు కూడైన పెట్టక
కష్టమంత కల్లు దుకాణం పాలుజేసి
వొట్టి చేతులు చూపే
నికృష్టపు మొగడు
నిలదీస్తే
నిప్పుతో చెలగాటమే
కొప్పులోకి
గుప్పెడు పూలుండవు గాని
తప్పెట దరువులు తప్పవు
వ్యసనాల ఒడిలో చేరి
ఉసురు పోసుకోవడమే కాని
మనసెరిగిన మనిషి కాలేడు
వేషాలేసి
మోసం చేసినోడితో
తాళి కట్టించుకొని
తాకట్టు పెట్టుకొన్న జీవితం
నట్టడవిలో దారి దొరక్క
కొట్టుమిట్టాడిన చందమే
వ్యత్యాసమొకటే
కలిమి కలిగిన వారికి
కాలం ఆగిపోతే బాగుండనీ
కష్టాల సుడి నొరిగితే
కాటికి ప్రయాణమెప్పుడనీ.

-వూట్ల భద్రయ్య 9550256840