S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పదనిసలు

* ఉద్యోగి
నెల మొదట్లో
కుబేరుడు
నెలాఖర్లో
కుచేలుడు

* బడి పిల్లలు
కార్పొరేట్ బడి పిల్లలు
బంగారు పంజరంలో
చిలుకలు
సర్కారు బడి పిల్లలు
స్వేచ్ఛగ ఎగిరే
గువ్వలు
* కాటికి కాళ్లు
వృద్ధాప్యంలో జబ్బులు
దీపం ఆర్పే పురుగులు

* పాదరక్షలు
ఇవి ‘పాత’రక్షలు
అందుకే మాటిమాటికి
తెగిపోతున్నాయి
* జాడలు
ఇప్పుడు వెతకాల్సింది
చంద్రుడిలో నీటి జాడలు కాదు
మానవ జీవితంలో
అంతరించిపోతున్న
పన్నీటి జాడలు
* గమనిక
ఎవరి ఏర్‌‘పాట్లు’
వారు చేసుకోవలసిందిగా మనవి
నిర్వాహకులకు సంబంధం లేదు

* ఎదురుచూస్తుంటాయ్
పీనుగు కోసం నక్కలు
జీతం కోసం ఖర్చులు

* వెల అంతే
ఈ ‘బీస్’కెట్లు రుచిగా ఉంటాయి
మీరు చదివింది కరెక్టే
ప్యాకెట్ ఇరవై రూపాయలు మరి

* ‘తంబి’లనాడు
ఇక్కడ అందరూ
మాటకు ముందు
తంబి తంబి అంటున్నారు

* మిస్‌ఫైర్
గన్నైనా పెన్నైనా
మిస్‌ఫైర్ అయితే
మిగిలేది శూన్యమే

* పిల్లకాయలు
అమ్మా! మీ ‘పీల’కాయలకి
అప్పుడప్పుడూ కొంచెం
బూస్టు గట్రా తినిపిస్తూ ఉండండి

* జనాలు
ఏమిటక్కడ జనాలు
ఉచిత భో‘జనాలు’

* డంబాలు
మా ఊల్లో ఓ
గొప్పల గోవిందయ్య ఉన్నాడు
ఎప్పుడూ బిల్‌‘డప్పులు’
కొడుతుంటాడు

* కనకపు సింహాసనం మీద...
ఆ ఊరి నాయకుడు
పౌరసత్వంలో ప్రథముడు
మానవత్వంలో అధముడు

-చిరమన వెంకట రమణయ్య 9441380336