S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్షమ

క్షమించడమంటే
ఒక ఉన్నత స్థానంలో నిల్చుని
క్రింది వాడిని తిరస్కారంగా
నిర్లక్ష్యపరచడం కాదు.
ఆంతర్యం నిండా
ఆధిక్య భావాన్ని నింపుకుని
లెక్కలేనితనాన్ని
ప్రదర్శించడం కాదు
ఒక అల్పుని మీద
దయా వర్షాన్ని కురిపిస్తున్నట్లు
నటించడం కాదు.
ఒక మహోత్తమ కార్యాన్ని దేన్నో
ఉదారంగా నిర్వహిస్తున్నట్లు
ఆడంబరం ఒలకబోయడం కాదు.
క్షమించడమంటే
ప్రేమతో ద్వేషాన్ని రద్దుపరచడం.
హృదయాన్ని మూసేసిన
లాకులను తెరిచి
ప్రేమ ప్రవాహాల్ని పారించడం.
పొంగుతూ ఉరికొచ్చే
ద్వేష నదులను
ప్రేమాంబురాశిలో లీనం చేసి
ద్వేషాన్ని అభావం కావించడం.
క్షమ - ఒక పరుసవేది
నకారాత్మక శక్తులను
తటాలున ఆపి
అప్పటికప్పుడే
హృదయ పరివర్తన వైపు మళ్లించే
అద్భుత చోదకం క్షమ
క్షమించిన మనిషిలోని
దైవత్వాన్ని ద్విగుణీకరించి
క్షమను పొందిన వాడిని
దైవత్వం వైపు అడుగేయించే
తక్షణాశ్చర్య చర్య - క్షమ
అది - కరుణజన్య సంయోగ క్రియతో
ఎడదలను హరితపరచే
రసాయన ప్రక్రియ!

-సిహెచ్.వి.బృందావనరావు 9963399189