S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సహితం

పత్ర దళాల కదలికలు
గాలిని పుట్టిస్తాయి
వాటిని కదలనివ్వండి.

విదిలించుకున్న పక్షి రెక్కలు
స్వేచ్ఛకు అర్థాన్ని వివరిస్తాయి
వాటిని ఊగనివ్వండి.

ఉరుకులాడే ఉడుత పాదాలు
ఉత్సాహాన్ని సాక్షాత్కరిస్తాయి
వాటిని ఉరకనివ్వండి.

పడగ విప్పిన పాముల బుసలు
సమయస్ఫూర్తిని ప్రబోధిస్తాయి
వాటిని బుసలు కొట్టనివ్వండి.

ఏ విషయంలో చూసినా
పరమాణువంతైనా పరమార్థం ఉంటుంది
దాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి
హితాన్నిచ్చే ఏ సహితాన్ని నిర్లక్ష్యంగా చూడకండి.
అంతే...

-కుషినేర్ల నందన్‌కుమార్ గౌడ్ 9603234503