S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మట్టి బాసలు

మట్టిని కలనుగనక్కర్లేదు
మట్టి మీదేగా మనమున్నాం

మట్టినెవడు ఉద్ధరించనక్కర్లేదు
మట్టితోనే మన మనుగడ

మట్టి గుండెల్ని చీల్చుతాం
ఐనా పచ్చని ప్రేమే చూపిస్తది మట్టి

మట్టి మాయలు చేయదు
మట్టిపైన మనిషి చేసే మాయలు కొల్లలు

మట్టి మిడిసిపడదు
మిడిసిపడే మనిషి మట్టిలో కొరుగుతాడు

మట్టికి దగ్గరి బంధువు శ్రామికుడు
వాడు మట్టిని పట్టుకుంటే పులకిస్తది

మట్టి కూడా మాట్లాడుతుంది పంట గొంతుతో
మట్టి వౌనం దాల్చితే లోకం ఎండిన చెట్టు!

మట్టిని ప్రేమించేవాడు మనిషవుతాడు
మట్టిని ద్వేషిస్తే అమ్మను ద్వేషించినట్టే!

మట్టి మీదే రాయాలి మనిషి జీవన కావ్యం
ఆకాశం మీద రాస్తానంటే జీవితమే అపసవ్యం!

ఎంతెదిగిన వాడి కాళ్లయినా మట్టిమీదే గదా
కళ్లు మూసుకు ప్రవర్తిస్తే మట్టి క్షమించదు

ఎంత తీర్చినా అమ్మ రుణం తీరిపోనట్టుగానే
ఎంత తిరిగిచ్చినా మట్టి రుణం రవ్వంతైనా తీరదు!

ఎం.నాగన్న 9951085760