S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అమ్మతనం కూడా వ్యాపారమే!

కడుపు చీల్చుకు పుట్టే పసిగుడ్డు
నాలుగు మెతుకులను మోసుకొచ్చే వాహకం

పేదరికపు సాలీడులో పురుగులై
నెలల చక్రంలో కొట్టుకుపోతుంటారు

బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్లు లేని
దేశంలో కరెన్సీకి వేలాడుతున్న శకలాలు

వేరొకరి వంశాంకురపు కలని మెదళ్లలో కుక్కొని
నిశ్శబ్దంగా బతుకు ఈడుస్తారు

కూటి కొరకు కోటి విద్యలు వచ్చో రావో తెలియదు కానీ
గుప్పెడు అన్నం ముద్ద కోసం కడుపులను చీల్చుకుంటున్నారు

కటిక దారిద్య్రం వలలో పడీ గిలగిలా కొట్టుకుంటున్నారు
బతుకు కోసం పోరాడే చేపలా
శరీరం వ్యాపార వస్తువు అయినప్పుడు
మెతుకు పుట్టని గరీబు కడుపులే వారికి మార్కెట్లు

తొమ్మిది నెలల కష్టాన్ని, కన్నీళ్లని ఎవరికో అప్పగించి
దుఃఖం వొడ్డున్న ఎన్నో జీవితాలు విలపిస్తున్నాయి.

-పుష్యమీ సాగర్ 9032215609