S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గతి తప్పుతున్న కాలం

ఈ గుండెకి గాలి ఆడటం లేదు
ఎప్పుడూ రక్తానికి బదులు
చెమట వరదల్లో తడిసిన ఈ గుండె
ఇప్పుడు తడారిపోయిన ఎడారిలా కనిపిస్తోంది!!
గడియారంలో బ్యాటరీ అయిపోయి
నిస్సత్తువుగా తిరగనా వద్దా అన్నట్లు
తిరగలేక తిరుగుతున్నట్లుంది!!

అతి సున్నితమైన ఈ గుండెని-
ఎవరో ముల్లుల్తో పొడిచినట్లున్నారు..
గుండె మొత్తం హోల్స్‌లో నుండి గాలి
బుసలు బుసలుగా ఎగదన్నుకొస్తోంది!!

ప్రేమాభిమానాలు పంచిన ఈ గుండెని
ఎవరో సూటిపోటి మాటల దిమ్మలతో మోదినట్లున్నారు
సాటి హృదయానికి బాధల్ని మిగల్చలేక అల్లాడుతూ
మూలుగుతూ పడి ఉన్నది!

ఈ గుండె ఎప్పుడైనా అలసిపోయి
పని చెయ్యక ఆగిపోవచ్చు!
కాని-
మరెన్నో గుండెల ఫొటో ఫ్రేముల్లో గూడుకట్టుకున్న
బంధాల బందీ నుండి
తుడిపెయ్యడం ఎవరి తరం కాదు-
జ్ఞాపకాల అనుబంధాల గొలుసుల్నుండి
తెంపెయ్యటం ఎవరివల్లా కాదు!

-చలపాక ప్రకాష్ 9247475975