S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాస్త జాగా

అతిక్రమించే వాళ్లు కొందరు
ఆక్రమించేసే వాళ్లు కొందరు
గద్దల్లా నేలను తన్నుకుపోయే
బడా బాబు‘లుండ’నే ఉన్నారు...
రక్షించే వాళ్ల అండదండలుంటే
భూగోళం మొత్తం గందరగోళం కాదా..
కాంక్రీటు జంగిళ్లలో నివసించేవారికి
పైన ఆకాశం, క్రింద నేలా కనిపించే దారేది
పొరపాట్న సెలవులొస్తే
పిల్లలకు ఆడుకోవడానికి
కారిడార్లు, బాల్కనీలే ప్లేగ్రవుండ్లు
పచ్చిగాలి పీల్చుకొని
పైలాపచ్చీసుగా బయటకు
నాలుగడుగులు వేద్దామన్నా
ఖాళీ జాగా కాస్తయినా కనిపించదే..
మనసులు ఇరుకయిపోయినట్టే
ప్రదేశాలూ ఇరుకిరుగ్గా మారిపోతున్నాయే..
కాస్త జాగా కోసం మరో భూగోళం వెదకాలి...

-యన్.కె.నాగేశ్వరరావు 9030360988