S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్చ్..పూర్ పూనమ్! (‘క్లాప్’కొట్టు గురూ!)

అందచందాలతోనే కాదు, కళ్లతోనూ కైఫ్ ఎక్కించే ‘నషా’్భమ, బాలీవుడ్‌లో అత్యంత వివాదాస్పద నటి, మోడల్ పూనమ్ పాండేకు నిత్యం వార్తల్లో వుండటం ఎలాగో బాగా తెలుసు అంటున్నారు ఆమె సన్నిహితులు. పూనమ్‌కే కాదు, ఇది బాలీవుడ్ భామలందరికీ వర్తిస్తుంది. అయితే ఇలాంటి పూనమ్‌పై వార్తలు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. లేని పోని రూమర్స్‌తో ఆమెను మానసికంగానే కాదు, కెరీర్ పరంగా కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల పూనమ్ గర్భం దాల్చి అబార్షన్ చేయించుకున్నట్టు లేనిపోని అసత్యాలను ఓ వెబ్‌సైట్ ప్రచురించిందట. ఈ కథనం పూనమ్‌ని తీవ్రంగా బాధించిందట. ఈ విషయంపై పూనమ్‌ని కదిలిస్తే- ‘‘వెబ్‌సైట్‌లో వచ్చిన ఈ కథనం ఒట్టి బూటకమే. అందుకే ఆ వెబ్‌సైట్‌పై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. అంతేకాదు, రూ.వందకోట్ల పరువు నష్టం దావా కూడా వేశాను. ఎలాంటి ఆధారం లేకుండా ఆ కథనాన్ని ఎందుకు రాశావని నేను ఆ రిపోర్టర్‌ను అడిగితే ఆమె చెప్పింది విని బిత్తరపోయాను. తన వద్ద ఎలాంటి ఆధారం లేకపోయినా... ఎవరో చెప్పింది విని తాను అది రాసినట్టు తెలిపింది. నేను ఆమె చెప్పిన సమాధానానికి షాక్ తిన్నాను. మామూలుగా బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని చూసే అందాలభామలపై ఇలాంటివి మామూలే..కానీ మరీ ఇంత నీచంగా వుంటాయా? అని ఆశ్చర్యపోయాను. ఏది ఏమైనా నేను ఇకపై రూమర్స్‌పై కూడా తీవ్రంగా స్పందిస్తాను’’అంటూ చెప్పుకొచ్చింది. ప్చ్.. పూర్ పూనమ్!!

శృతి హవా!!
కమల్ ముద్దుల తనయగా వెండితెరపై అడుగుపెట్టిన శృతిహాసన్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకొని ఇమేజ్ చట్రంలో బందీకాకుండా కెరీర్‌లో ముందుకు దూసుకెళుతోంది. అగ్ర హీరోలతో నటిస్తూ, గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్‌ని జతచేసి అందరి మతులు పోగొట్టింది. అయితే ఇన్నాళ్లు గ్లామర్.. గ్లామర్ అంటూ యువతను తనవైపునకు ఆకర్షించుకున్న ఈ అమ్మడు ఇకపై అందుకు భిన్నంగా కెరీర్‌ని మలుచుకోవాలనుకుంటుందిట. బాలీవుడ్‌లో శృతిహాసన్ నటించిన సినిమాల్లో ఆమె గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగానే ఉండేలా చూసుకున్న మాట నిజం. అయితే సౌత్‌లో మాత్రం ఆమె గ్లామర్ బ్యూటీగా యువతను ఆకట్టుకుంది. ప్రస్తుతం నాలుగైదు అగ్ర హీరోల చిత్రాల్లో నటిస్తూ యమబిజీగా వున్న శృతి ఆయా చిత్రాల్లో యువతతో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునేలా ఆమె పాత్రలు రూపుదిద్దుకున్నాయంటున్నారు ఆమె సన్నిహితులు. ఇకపై నటనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పాత్రలను ఎంపిక చేసుకునే ఆలోచనలో శృతి వుందట. దటీజ్..శృతి!!
హాలీవుడ్‌వైపు మొగ్గు!

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇక హాలీవుడ్‌వైపునకే బాగా మొగ్గు చూపుతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బాలీవుడ్‌లో అడుగుపెట్టి నెంబర్‌వన్ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న ఈ సుందరికి అనతికాలంలోనే అత్యంత ఆదరణ లభించింది. నటించే ప్రతీ చిత్రానికి తన పాత్రల పరిధులను విస్తరించుకుంటూ యువతరం గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. గత కొంత కాలంగా దీపికా నటించిన సినిమాలన్నీ వసూళ్ల పరంగా వంద కోట్ల మైలురాయిని దాటాయి. ఈ నేపథ్యంలో ఓ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోనూ పాదం మోపింది. ఏ భాషలో నటించినా అభినయానికి ఆస్కారమున్న అర్థవంతమైన చిత్రాలకే తన తొలి ప్రాధాన్యత అని చెబుతోంది. సినిమాల్లో అడుగుపెట్టక ముందు ఎలా వున్నానో ఇప్పటికీ అదే జీవనశైలిని అనుసరిస్తున్నాను. సాధించిన విజయాల్ని తల్చుకొని గర్వపడటం తనకు అస్సలు నచ్చదంటోంది దీపికా! వృత్తి పరంగా తప్పితే వ్యక్తిగతంగా తనలో ఎలాంటి మార్పులు లేవంటోంది ఈ బ్యూటీ!

-సమీర్