S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇలా అయితే జ్ఞాపకశక్తి పెరుగుతుందిట! (విజ్ఞానం)

మతిమరుపు లేదా విషయాలు గుర్తు లేకపోవడం, గుర్తింలేకపోవడం అనేది చాలామందికి ఎదురయ్యే సమస్యే. ముఖ్యంగా నాడీసంబంధ వ్యాధులున్నవారికి ఈ సమస్య ఎక్కువ. అయితే అలాంటివారికి జ్ఞాపకశక్తి, గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి మెదడుకు తేలికపాటి విద్యుత్ తరంగాల తాకిడి (కరెంట్‌షాక్) ఫలితాలన్నిస్తోందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఆ షాక్ కేవలం మెదడుకు చక్కిలిగిలి పెట్టినట్లు ఉంటుందని, దీనివల్ల కొన్ని పదాలను గుర్తించడం, గుర్తుపెట్టుకోగలగడం, ఉచ్ఛరించడం చేయగలుగుతారని ఆ అధ్యయనంలో తేలింది. మెదడులోని ప్రత్యేకించి కొన్ని భాగాలకు మాత్రమే ఇలా తేలికపాటి కరెంట్ షాక్ ఇవ్వడం జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మాయో క్లినిక్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో కొన్ని మరచిపోయిన పదాలను పరిశోధనలకు సహకరించినవారు చెప్పగలగడం విశేషం. చెవులు, నుదుటి మధ్య మెదడు భాగాలకు ఇలా కరెంట్ షాక్ ఇవ్వడంవల్ల ఈ ఫలితాలు కనిపించినట్లు వారు పేర్కొన్నారు. ఎదురుగా ఉన్న పదబంధాల జాబితాలో ఇలా మెదడుకు విద్యుత్ తరంగాల తాకిడి కలగకముందు చెప్పలేని వాటిని ఆ తరువాత చెప్పగలగడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి పరీక్ష తరువాత కొన్ని పదాలను, బొమ్మలను గుర్తించగలగడం, గుర్తుంచుకోవడం సులభంగా ఉందని ఓ రోగి స్పష్టంగా చెప్పాడు. ఈ అధ్యయనానికి మైఖేల్ సెవిజ్ నాయకత్వం వహించారు. మెదడులో అంతర్లీనంగా ఉండే కొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ ద్వారా ప్రేరణ కలిగించడంవల్ల భాషాపరమైన సమాచారాన్ని గుర్తించడం, పలకడంలో విశేషమైన ప్రగతి కనిపించిందని ఆయన తమ అధ్యయనంలోని ఫలితాలను వివరిస్తూ చెప్పాడు. మానసిక, నాడీసంబంధ వ్యాధులతో బాధపడేవారికి ఇలా మెదడుకు విస్తృత ప్రేరణ కలిగించడంవల్ల మేలు జరుగుతుందని సీనియర్ ఆథర్ గ్రెగరీ వారెల్ చెప్పారు. మెదడులో జ్ఞాపకశక్తికి కారణమైన నాలుగు భాగాలపై వీరు ప్రయోగాలు చేశారు. గ్రహణం మొర్రి బాధితులకు కూడా ఇలా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూంటాయి. కంప్యూటర్‌లో కొన్ని పదాలజాబితాను చూపిస్తూ ఒకసారి చదవమనడం, ఆ తరువాత మెదడుకు విద్యుత్ ప్రేరణ కలిగించడం, ఆ తరువాత మళ్లీ పదాలను చదమనడం ఈ పరిశోధనల్లో నిర్వహించిన ప్రయోగం. మొదటిసారికన్నా రెండోసారి వారు సులువుగా, గుర్తుంచుకని పదాలను చెప్పడం సాధ్యమైంది. పైగా జాబితాలో ఉన్న వరుసలోనే వాటిని ఉచ్ఛరించడం పరిశోధకులను ఉత్సాహపరిచింది. 22మంది రోగుల్లో నలుగురు ఇలా సానుకూలంగా స్పందించడం విశేషం. ఈ ఫలితాల వల్ల భవిష్యత్‌లో జ్ఞాపకశక్తిని పెంచే పరికరాల తయారీ సాధ్యమవ్వచ్చు. ‘జర్నల్ బ్రెయిన్’లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించనున్నారు.

-ఎస్.కె.ఆర్.