S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవత్వం ( కథ)

సోమేశ్వరపురంలో సాంబయ్య ఒక చిన్నపాటి రైతు. చిన్నతనం నుండీ తండ్రి వద్ద వ్యవసాయం, తాతగారి వద్ద వైద్యం కూడా నేర్చుకున్నాడు. ఎవరికైనా ఏదన్నా అనారోగ్యమైతే సాంబయ్య వద్దకే వచ్చేవారు. ఆ మారుమూల గ్రామంలో ఏ విధమైన వైద్య సౌకర్యమూ లేదు. ఐతే సాంబయ్య ఎవరి వద్దా చిల్లుగానీ తీసుకునేవాడు కాదు. ‘వైద్యం ప్రాణాలను కాపాడనుకానీ, ధనం సంపాదించను కాదు’ అని వాళ్ల తాతగారు చెప్పిన మాట. ఆయన పోయినా తాను మాత్రం పాటించడం తప్పలేదు సాంబయ్య. అందరూ సాంబయ్యను దేవునిలా భావించి, గౌరవించేవారు.
ఒకమారు పొలానికి ఎరువులు కొనాల్సి వచ్చి కాలినడకన ఒంటరిగా బయల్దేరాడు సాంబయ్య. సోమేశ్వర పురం నుంచీ పట్టణాని కెళ్లాలంటే ఒక చిట్టడవి దాటాలి. అక్కడ క్రూర మృగాలతో పాటు దొంగల భయమూ ఉంది. అందుకే రైతులు పది మంది వరకూ కలిసి వెళ్లేవారు. ఊరి వారికి వైద్యసేవలో ఉండి, మిగతా వారితోపాటుగా వెళ్లను సాంబయ్యకు కుదర్లేదు. అందుకే ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. ఎరువులు కొనను కావాల్సిన డబ్బు నడుముకు కట్టుకుని, మందుల సంచీ భుజానికి తగిలించుకుని, తనకి వచ్చిన గాయత్రీ మంత్రం జపించుకుంటూ నడక సాగించాడు. అడవి మద్యకి వచ్చేసరికి దొంగలు దాడి చేశారు.
‘ఏమోయ్! నీ దగ్గరున్న సొమ్మక్కడ పెట్టు. మాకు మనసైతే వదుల్తాం. లేపోతే నీవు సదువుతున్న ఆ మతరం చివరిసారిగా సదుంకో’ అంటూ అతడి వీపు మీద దుడ్డుకర్రతో కొట్టాడు దొంగల నాయకుడు. ఆ దెబ్బకు సాంబయ్య కింద పడ్డాడు. మోచేతికీ, నడుముకూ దెబ్బ తగిలింది. ఇంతలో ఏమైందో ఏమో ‘అబ్బా!’ అంటూ కిందపడిపోయాడు దొంగల నాయకుడు. నోట్లోంచీ నురగ రాసాగింది.
సాంబయ్య మెల్లిగా ఓపిక తెచ్చుకుని ‘నా మందుల సంచీ ఇవ్వండి! మీ నాయకుణ్ణి పాము తాకింది. కిందపడ్డ ఆ మూలికలూ, పొడులూ ఏరి తెచ్చివ్వండి. నేను వైద్యం చేస్తాను’ అంటూ లేచి కూర్చున్నాడు. సాంబయ్య చేతి నుంచీ రక్తం కారుతూనే ఉంది. దొంగలు ఆ మూలికలూ, పొడులున్న పొట్లాలూ ఏరి తెచ్చి సాంబయ్యకిచ్చారు. సాంబయ్య తన వద్ద మందు మూలికలతో వెంటనే ఆ దొంగల నాయకునికి చికిత్స చేశాడు. ఆ తర్వాత తన గాయాలకు మందు రాసుకున్నాడు. రక్తం కారుతున్న చోట కట్టు కట్టుకున్నాడు. అరగంటలో దొంగల నాయకుడు లేచి కూర్చున్నాడు.
సాంబయ్య కాళ్లు పట్టుకుని ‘క్షమించు దేవరా! నీ పేనం తియ్యాలనుకున్న నా పేనం కాచావు. నీ మేలు మరువను. ఏం కావాలో సెప్పు దొరా! పెమానికం సేత్తున్నా’ అన్నాడు.
దానికి సాంబయ్య ‘దొంగల దొరా! నీవు చేసే పని మంచిదేనా? ఆలోచించు. అంతా ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నీవు వారిని కొట్టీ, చంపీ దోచుకుంటున్నావ్! మీ అందరి ఒంట్లో శక్తి ఉంది. అడవిలో దొరికే ఎన్నో మందు మూలికలూ, కంకుడు కాయలూ, పండ్లూ ఫలాలూ అమ్ముకుని ఎంత సంపాదించుకోవచ్చో మీకు తెలీదు. రక్షక భటులకూ, మనుషులకూ భయపడుతూ చాటు బతుకులెంత కాలం బతుకుతారు? హాయిగా శ్రమచేసి సంపాదించుకుంటే ఎంత ధైర్యంగా బతకొచ్చో ఆలోచించండి. నాది వైద్య వృత్తి. ప్రాణాలు కాపాడ్డమే తప్ప తీయడం నా పని కాదు. నాకు వైద్యం తెల్సీ నీకు మందేయకపోతే ఏమయ్యేది? నాయకా! మీ వృత్తి మానుకుని కష్టపడి, శ్రమతో సంపాదించిన సొమ్ముతో హాయిగా మాలాగా ఊర్లో అందరితో కల్సి జీవించండి. చాటుమాటు బతుకులు మానండి’ అని చెప్పాడు.
దానికి దొంగల నాయకుడు సోమయ్యడు ‘దొంగతనం మానేస్తాను దొర! నీవు సెప్పినట్టే సేస్తాం’ అని ప్రమాణం చేసి, కష్టపడి బతకడం నేర్చుకున్నారు అంతా.
మానవత్వం ఎంతటి వారినైనా మంచిగా మార్చేస్తుంది.

-ఆదూరి హైమావతి