S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిద్ధుల త్రయం ప్రతిష్ఠించిన ఆలయం

భక్తజనులకు అనునిత్యం అండగా నిలిచే ముత్తాయికోట శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయం మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సిద్దమవుతోంది. మెదక్ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో గల ముత్తాయికోట శ్రీ సిద్దేశ్వరస్వామి క్రీ.పూ. 230 సంవత్సరాల నుంచి అంటే- సుమారు 2250 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. మెతుకుసీమలో అతిప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం స్వయంభూ శివలింగేశ్వరాలయం.
16వ శతాబ్దం చివరలో మెదక్ పట్టణంలో వంద స్తంభాల దేవాలయం ఉండేదని చరిత్ర ఉంది. పది శతాబ్దాల క్రితం సిద్దులు మచ్చేందర్‌నాథ్, గోరఖ్‌ణాథ్, కణిక్‌నాథ్ అనే సిద్దుల త్రయం సంచరించి, శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ముష్కరులు ఆ గుడిని ధ్వంసం చేయడానికి యోచిస్తారు, ఉత్తర దిశకు తీసుకెళ్లి శివలింగాన్ని భద్రపరచాలని ఓ అర్చకుడికి సిద్దుని రూపంలో శివుడు సాక్షాత్కరించినట్లు భక్తుల ఉవాచ. స్వయంగా రుద్రుడు తెలపడంతో ఎడ్ల బండిలో గొంగళి పరిచి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసు చివరిభాగం విరిగిపోవడంతో అక్కడే లింగాన్ని భద్రపరిచి వెళ్లిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దుబ్బాక ప్రాంతానికి చెందిన గొల్లకాపరి ఎల్లయ్య అనే భక్తునికి సిద్దేశ్వరుడు ప్రత్యక్షమై తెలపడంతో ముత్తాయికోటకు చేరుకొని కొందరు భక్తుల సహకారంతో దేవాలయం నిర్మించాడు. ఎల్లయ్య దేవాలయంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని ఉండగా మహాకాళీ, మహాసరస్వతి అమ్మవార్లు ప్రత్యక్షమై విద్యను ప్రసాదించారు. అమ్మవార్ల అనుగ్రహంతో తత్వప్రచార భక్తుడై భజనలు, కీర్తనలు, యక్షగానములు, హరికథలు చెబుతూ ఎల్లదాసుగా మారాడు. సన్యాశ్రమాన్ని స్వీకరించి సమాధి స్థితి పొందేవరకు అక్కడే ఉన్నాడు. నేటికీ ఇక్కడ ఎల్లదాసు సమాధి ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరించి, స్వయంగా ముగ్గురు సిద్దులు ప్రతిష్టించిన లింగం కావడంతో ఈ దేవాలయంను శ్రీ సిద్దేశ్వరాలయంగా, సిద్దుల త్రయంగా పిలుస్తారు. ముత్తాయికోట సిద్దమహేశా నీ మహిమ మహిమాన్వితము- అనే మకుటంతో ఒక కవి నక్షత్రమాలికలో చరిత్రను వర్ణించాడు. అనేకమంది రచయితలు శ్లోకాలు, పద్యాలు వ్రాశారు. మెదక్ ప్రాంతానికి చెందిన అనేక మంది వ్యక్తులకు సిద్దిరాములు అనే పేర్లు ఉండటం ఇక్కడి స్వామి వారిపై భక్తుల్లో ఉన్న విశ్వాసానికి తార్కాణం అని చెప్పవచ్చు. మహాశివరాత్రి వేడుకలకు చుట్టుపక్కల నుండి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి సిద్దేశ్వరుడి దివ్యసన్నిదిలో భక్తితో కాలక్షేపం చేసి తరించనున్నారు. తరలివచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.