S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముక్తికి మార్గం కాళేశ్వర దర్శనం

కాశీనాం మరణాః ముక్త్తి, కాళేశ్వరనాః దర్శనాం ముక్త్తి. కాశీలో ముక్తి ప్రసాదించినట్లు కాళేశ్వరం దర్శనం చేసుకున్నట్లయితే అదే ముక్త్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాశీ దర్శనం చేసుకోకపోయినా కాళేశ్వరం దర్శనం చేసుకున్నట్లయితే భక్తులకు ముక్త్తి లభిస్తుందనేది భక్తుల అపార నమ్మకం. అందుకే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు కాళేశ్వరం దర్శనానికి తాపత్రాయపడుతారు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 51 కిలో మీటర్ల దూరంలో వెలిసిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంను దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు మహా శివరాత్రి సందర్భంగా కాళేశ్వరంను దర్శించుకోవడానికి వస్తుంటారు. ప్రపంచంలోనే ఒకే పానవట్టంపైన జోడు లింగాల దర్శనం కేవలం కాళేశ్వరంలోనే ఉంటుంది.
పూర్వం శివుడిని దర్శించుకున్న భక్తులు నేరుగా కాశికి వెళుతుండటంతో యముడు ప్రాధేయపడగా, కాళేశ్వరంలో ఒకే పానవట్టంపైన యముడు, కాళుడు రూపంలో శివుడు భక్తులకు దర్శనం లభిస్తుంది. దాంతో కాళేశ్వరంలో ముందుగా యముడిని పూజించిన తర్వాత శివుడిని పూజించడం అనవాయితీగా వస్తుంది. భక్తులు చేసిన తప్పిదాలను కాళేశ్వరాన్ని దర్శించుకోవడంతో మినహాయింపు లభిస్తుందని చరిత్ర చెబుతోంది. అలాగే కాళేశ్వరం ప్రాంగణంలో గోదావరి నది, మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత నది, అంతర్వాహినిగా పేరున్న సరస్వతి నది.. మూడు నదులుగా కలుస్తున్నందున ఇక్కడ త్రివేణి సంగమంగా పేరున్నది. మూడు నదుల కలయిక అనేది దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేకపోవడం విశేషం. గోదావరి నదీ పరీవాహక ప్రదేశంలో అనేక దేవాలయాలు వెలిశాయి. దీంతో పాటు పూర్వం ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం పరిసరాలలో నేటికీ విభూతి ఉండలు లభిస్తుండటం ఇక్కడ ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. భారతదేశంలోనే అరుదుగా ఉండే సూర్య దేవాలయాలలో ఒకటి కాళేశ్వరంలో ఉండటం గమనార్హం. అలాగే కాశ్మీరులో బాల సరస్వతి ఉండగా, తెలంగాణలోని బాసరలో ఙ్ఞన సరస్వతి కాగా కాళేశ్వరంలో ప్రౌఢ సరస్వతి దేవాలయం ఉండడం ప్రత్యేకతను సంతరించుకున్నది. సువిశాల మైదానంతో పాటు పచ్చని చెట్ల ప్రాంగణంతో పాటు భక్తులకు సకల సదుపాయాలు కల్పించడంలో ఆలయ కార్యనిర్వాహాణాధికారి బుర్రి శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కాళేశ్వరం దేవస్థానం అభివృద్దికి తెలంగాణ సర్కారు 25 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించింది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలు కల్పించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఆలయ కార్యనిర్వాహాణాధికారి శ్రీనివాస్ తెలిపారు. గోదావరి పుష్కరాలతో పాటు ప్రాణహిత పుష్కరాలలో కాళేశ్వరానికి అశేష జనవాహిని దర్శనం చేసుకోగా ఏటా మహా శివరాత్రి పర్వ దినం సందర్భంగా కాళేశ్వరానికి వేలాదిగా భక్తులు తండోప తండాలుగా తరలివస్తుంటారు.

-పరమరాజ్యుల శివకుమార్