S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణకే తలమానికం బీరంగూడ శైవ క్షేత్రం

పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ మండలం భీరంగూడ గ్రామ పరిధిలో ఉన్న భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రానికే వనె్న తెచ్చే ఆలయంగా అలరారుతోంది. తెలంగాణలోని ఇతర శివాలయాల కంటే భిన్నంగా అత్యధిక ప్రాచుర్యం సొంతం చేసుకున్న భీరంగూడ శివాలయం భక్తుల కొంగు బంగారంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఓంకార స్వరూపుడైన శివుడు కొలువుదీరిన ఈ పుణ్యక్షేత్రం మహా శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. సాక్షాత్ శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి సమతూగగల ఈ ఆలయం భారీ ప్రాకారంతో సువిశాల ప్రాంగణంతో అలరారుతోంది. శ్రీశైలం మల్లిఖార్జున ఆలయం మాదిరిగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలయ కమిటీ యోచిస్తోంది. అతి పురాతనమైన ఈ దేవాలయం ఆరవ శతాబ్దకాలానికి చెందినదిగా పెద్దలు చెబుతుంటారు. బాదామి, చాణిక్యులు, రాష్టక్రూటులు, కల్యాణ చాణిక్యులు తదితర రాజుల కాలంలో ఇది గొప్ప పుణ్యక్షేత్రంగా వెలుగొందినట్లు చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజుల కాలంలోను మహా దేవాలయంగా అలరారినట్లు భక్తులు గుర్తుచేస్తుంటారు. అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని భీరంగూడ గ్రామానికి ఉత్తర దిశగా గల గుట్టపై కొలువుదీరిన ఈ శివాలయం భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం కలిగిస్తోంది. ప్రకృతి సౌందర్యంతో సువిశాలమైన స్థలంలో వెలసిన మల్లికార్జునుడు భక్తుల కోరికలు తీర్చే దేవదేవుడిగా ప్రాచుర్యం సంపాందించారు. ఈ దేవాలయంలో పూర్వకాలంలో భృగుమహర్షి తపస్సు చేసినపుడు వారి భక్తికి మెచ్చి, శ్రీ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమైనట్లు పురాణ కథనం. ఈ ప్రాంత భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం కలిగించాలని పుణ్యపురుషులు కోరారు. అందుకు అంగీకరించినన ఆదిదంపతులు వారి మొరనాలకించి బీరంగూడ గుట్టపై వెలసినారన్న కథనం ప్రచారంలో ఉంది. భ్రమరాంబికా మల్లికార్జున ఆలయం నైఋతి దిక్కు నుండి మహా శైవక్షేత్రమైన శ్రీశైలం దేవాలయం వరకు సొరంగ మార్గం ఉన్నట్లు గుట్టపై ఉన్న ఆనవాళ్ల ద్వారా స్పష్టమవుతోంది. ఇక్కడ రాత్రి పూట ఇంద్రసభ జరుగుతుండేదని పెద్దల ఉవాచ. చాళుక్యుల పరిపాలనలో బిజ్జీలుని వంశమునకు సంబంధించిన ఇమ్మడి జయసింహుడనే రాజు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. 1015 సంవత్సరము నుండి 1042 సంవత్సరము వరకు పొట్టలకేరిలో (పొట్టలకేరి అనగా ప్రస్తుతం ఉన్న పటాన్‌చెరు పట్టణం) జయసింహుడు నివాసం ఉన్నట్లు చరిత్ర సాక్ష్యాలు వివరిస్తున్నాయి. జయసింహుని సతీమణి పట్టపు రాణియైన సుగ్గుళాదేవి మంచి శివ భక్తురాలై దేవదేవుడైన మహాశివుడిని భక్తిగా పూజించినట్లు చెప్పుకొంటారు. భీరంగూడ భ్రమరాంబికా మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శివుడిని సందర్శించుకుని పునీతులవుతారు. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని ఈ ఆలయంలో అసంఖ్యాకంగా హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. పటాన్‌చెరు, రామచంద్రాపూర్, అమీన్‌పూర్‌లు హైదరాబాద్‌లో అంతర్భాగం కావడంతో పాటు పారిశ్రామికవాడ అయన ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. ఈ ఆలయానికి అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు వచ్చి మొక్కులు సమర్పించుకోవడం విశేషం.