S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దటీజ్..ప్రియాంక!

బాలీవుడ్ తారలపై రూమర్స్ మామూలే! అలా అని అందరి తారలపై ఇలాంటి రూమర్స్ పెద్దగా లేవు. ఏవో కొందరి విషయాల్లో అలా పుట్టుకొచ్చాయంతే! బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా విషయాన్ని తీసుకుంటే...ఈ ముద్దుగుమ్మపై లేనిపోని రూమర్స్ అంటూ ఏవీ లేవు. అయితే అందుకు ఆమె ఎన్నో జాగ్రత్త తీసుకున్నానంటోంది. అందులో భాగమే మీడియాతో ప్రతీ విషయాన్ని చెప్పేయటమేనట. అందుకే తనకు రూమర్స్ దూరంగా వున్నాయంటోంది. ‘‘చాలా మంది తారలు తమ విషయాలను గోప్యంగా వుంచుతారు. ఫలితంగా లేనిపోని రూమర్స్ వాళ్లని చుట్టేస్తాయి. గోరంతని కొండంతలు చేస్తూ మీడియా అలాంటి వారిపై దృష్టిసారించడం వల్ల రూమర్స్ కోకొల్లలుగా పుట్టుకొస్తాయి. నాకు నా కెరీరే ముఖ్యం. నేను చేసే చిత్రాలు..వేసే క్యారెక్టర్స్ ఇవే నా మనసులో మెదిలేటివి. అనవసర విషయాల జోలికి వెళ్లనుగాక వెళ్లను’’అంటూ సెలవిచ్చింది.

ప్చ్..ప్రియాంక!!

బాలీవుడ్‌ని వదలను!
పోర్న్‌స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్‌ని ఇక వదలట. ఎన్నో ఆశలు..మరెన్నో ఆశయాలతో బాలీవుడ్‌లోకి వచ్చిన సన్నీ గొప్ప స్టార్ కావాలనుకుని ఎన్నో వదులుకుందట. మరెన్నో పోగొట్టుకుందట. ఈ విషయం గురించి సన్నీ వివరిస్తూ- ‘‘పోర్న్ స్టార్‌గా ఎంతో పేరు సంపాదించుకున్న నాకు బాలీవుడ్‌పై ఉన్న ఆసక్తితో ఇక్కడకు వచ్చాను. నేను నటిస్తున్న చిత్రాల ద్వారా నాకు అభిమానులు మరింతగా పెరుగుతున్నారు. ఇంతగా అభిమానులను సంపాదించుకుంటున్నా బాలీవుడ్‌లో మాత్రం ఇంకా కొద్ది మంది దృష్టిలో పోర్న్ స్టార్‌గా ముద్ర వుంది. దీనిని వదిలించుకునేందుకే నేను బాలీవుడ్‌లో ఏంటో చూపించాలనుకుంటున్నాను. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లకు ఇప్పటికి నాలోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఎంతో మార్పు వచ్చింది నా విషయంలో. ఇప్పుడు అంతా సన్నీ..సన్నీ..అంటూ పిలుస్తున్నారు. ఒక్క బాలీవుడ్డే కాదు, తెలుగు, తమిళ అవకాశాలు కూడా నన్ను వరిస్తున్నాయి. అయితే నా దృష్టి అంతా బాలీవుడ్‌పైనే వుంది. ఇక్కడ నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. నిరూపించుకుంటాను కూడా. అలా నిరూపించుకునే వరకూ బాలీవుడ్‌ని వదలనుగాక వదలను’’అంటూ చెప్పుకొచ్చింది. నిజంగా సన్నీ గడుసుపిండమే సుమా!!

అత్యాశలేదు!

వెండితెరపై అడుగుపెట్టే గ్లామర్ తారలంతా ఏదో అయిపోవాలనో..ఎంతో సంపాదించుకోవాలనో కలలుగనడం సహజమే! అయితే అందాలభామ రకుల్ ప్రీత్‌సింగ్ మాత్రం అలా అనుకోలేదట. అందరిలాగ కాక, మరేదో ఆమె మనసులో బలంగానే ఉన్నట్లుంది. ఈ విషయం గురించే రకుల్‌ని కదిలిస్తే- ‘‘చిత్రసీమలోకి అడుగుపెడుతూ చాలామంది తారలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. నేను మాత్రం అలాంటివేమీ పెట్టుకోలేదు. పెద్ద స్టార్ అయిపోవాలని..బాగా సంపాదించేయాలని..లాంటి ఆశలేమీ లేవునాకు. చేసిన కొన్ని చిత్రాలైనా మంచివి అనుకున్నవి చేస్తే చాలు. ‘్ఫలానా పాత్ర రకులు బాగా చేసింది’ అని అనిపించుకుంటే చాలు. ప్రస్తుతం నాకు మంచి సినిమాలు వస్తున్నాయి. ఆయా సినిమాల్లో నాకు నచ్చిన పాత్రలు లభిస్తున్నాయి. ఆ క్యారెక్టర్స్‌కు నేను న్యాయం చేశానా? లేదా? అన్నదే నా ముందున్న సవాల్. ఎలాంటి క్యారెక్టర్ అయినా రకుల్ బాగా చేస్తుంది అని అనిపించుకుంటే నాలో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు’’అంటూ చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్. ఇన్ని కబుర్లు చెబుతున్న రకుల్ తాజాగా అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’లో ఆడి పాడుతోంది. ఈ చిత్రం వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక రకుల్ సరైందే అనిపించుకుంటుందిట! అదీ..విషయం!!

-సమీర్