S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రవహించే పాట

పాటే ఒక దాహ ప్రవాహం
కవి మెదడులో పుట్టి, సంగీతజ్ఞుడి చేతిలో విస్తరించి
గాయకుడి గొంతులో ప్రవహించి
శ్రోతా జనసంద్రంలో కలిస్తే తప్ప,
అది ప్రవాహం కాదు, దాహ ప్రవాహమూ కాదు,
ఒక సంగమమూ కాదు.

చిన్నగా చెవిగుండా ప్రవహించి, హృదయమంతా నిండిపోయి
నిన్ను బెలూన్‌లా పైకి లేపి
అమృత లోకాల్ని, అద్భుత ప్రపంచాల్ని చూపేది పాట
చిలిపిగా ప్రవేశించి, హృదయాన్ని అల్లకల్లోలం చేసి,
నిలబడనీయక, కూర్చుండనీయక గొంతులోనే తచ్చాడుతూ
బయటికి రాక, లోన ఉండిపోక
జీవిత క్షణాల్ని మనోహర శిల్పాలుగా తీర్చిదిద్దేది పాట
అనుభవం, అనుభూతి, ఉద్వేగం, ఉచ్ఛ్వాసకు ముఖద్వారమైనప్పుడు
దొరికే జీవిత మకరందం - పాట.

కొన్ని ధ్వని ప్రకంపనలు, తాళ వాద్య ధ్వనులు
చర్మవాయిద్యాల ఢమఢమలూ నేపథ్యంలో నిలబెట్టుకుని
నీ గొంతు మాధుర్యమేదో ప్రదర్శించాలనుకుంటే
నిజమే! అది ఒక్కోసారి పాట కాకపోవచ్చు
శ్రోతల మనసులు పురివిప్పి ఆట మొదలుపెడితేనే
అది పాటగా మారిపోతుంది.
మనసుకు అద్దుకోనిదేదైనా ఉట్టి గోలే కదా?

గాయకుడి గొంతు గోపురం కింది నుండి
పాట గుడిలోకి ప్రవేశించి
సుస్వరాల రాగాల ద్వారాలు దాటుకుంటూ, దాటుకుంటూ
పాట మధురిమకు నమస్కరిస్తూ, ఆనందంలో సుళ్లు తిరుగుతూ
గర్భగుడిలోని విరాట్ స్వరూపం కవి పదాల పొందికను దర్శించుకుని
అర్థాన్ని అర్చించుకుని, ఆత్మానందాన్ని దీపంగా వెలిగించి
పాటను పూజించి రావడమే ఈ జీవితానికి పరమార్థం
నిన్ను నువ్వు అర్పించుకుంటే గాని, పాట నిన్ను కటాక్షించదు
పాట నిన్ను కరుణిస్తేగాని నీకో హృదయముందని
నువ్వో మనిషివని రూఢి అవదు!
హృదయం నీరసించినప్పుడల్లా పాటల సెలైన్ ప్రాణదానం చేస్తుంది
వైద్యమైనా, నైవేద్యమైనా అది పాటలతోనే సాధ్యం.
***

సింహావలోకనం

అరవయి ఏళ్లు దాటిన
నా సుమధుర జీవనయానంలో
ఊహించని ఎత్తుపల్లాలను
ఉరికి వచ్చిన ఒడిదుడుకులను
చవి చూచిన క్షణాలు
లెక్కకు మించి లేకపోలేదు!
అనారోగ్యంతో
అస్తవ్యస్తంగా మారిన బాల్యం
తదుపరి జీవన మార్గం కోసం
ఆలోచించని క్షణాలు లేవు!
అక్షర జ్ఞానం
అంతంత మాత్రమే అయినందుకు
చదువుల తల్లి ఒడిలో
చోటు దొరుకుతుందో
లేదోనన్న బెంగ... క్షణక్షణం
నన్ను కుదిపి వేస్తుండేది!
కళ్ల ముందు - అఆ
భయంకరంగా కన్పించే
భవిష్యత్తును గురించి
ఆలోచించిన సమయాలు
గుర్తుకొచ్చినప్పుడల్లా
ఒళ్లు ఝల్లుమంటుంటుంది!
ఆశాజీవిగా
అడుగులు ముందుకు వేయడం
నేర్పిన నా అనుభవాలు,
కష్టాలను ఎదుర్కోవడమూ
నేర్పించడమే కాదు...
సుఖాలను సజావుగా
అనుభవించడానికి
కిటుకుల కిటికీ
తెరవడమూ నేర్పాయి!
గజిబిజిగా గతించిపోయిన
గతాన్ని - ప్రశాంతంగా పరిశీలనగా
సింహావలోకనం చేసుకున్నప్పుడల్లా
రేపటి గురించి-
చిగురించిన ఆశలతో
మనస్సు తేలిక పడిపోతుంటుంది
తొలకరి జల్లుకు,
ఒళ్లు పులకించినట్లు
మదినిండా - ఆనందం
మొలకలెత్తుతుంటుంది!
******

అమ్మ

-మాధవీ సనారా
9440103134
వెన్ను మీద
మిన్ను విరిగి పడినంత
నొప్పులు భరించి
కంటుంది అమ్మ.
మన్ను మీద పడిన
బిడ్డడిని గని
మిన్నులోని చంద్రుడిలా
తలచి
పులకించి పోతుంది
అమ్మ!

-డా.దేవరాజు మహారాజు 99086 33949