S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉత్పాదకత ( సండేగీత )

ప్రతిరోజూ ఎన్నో పనులని చేద్దామని అనుకుంటాం. కానీ చేయలేకపోతాం. ప్రయత్నించి చేయలేక పోవడం వేరు. ప్రయత్నం చేయకపోవడం వేరు.
జీవితంలో ఎన్నో లక్ష్యాలు వుంటాయి. కొన్ని సుదీర్ఘమైనవి. మరికొన్ని చిన్నవి. వాటినే ఇంగ్లీషులో షార్ట్‌టర్మ్ గోల్స్ అంటారు. సుదీర్ఘ లక్ష్యాలని తరచూ భవిష్యత్తుల్లోకి త్రోసివేస్తున్నామా? రోజువారి వున్న లక్ష్యాలను కూడా భవిష్యత్తులోకి త్రోసివేస్తున్నామా? ఇవి రెండూ జరిగితే మనకు నిరుత్సాహం వస్తుంది. అసంతృప్తికి లోను చేస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది.
లక్ష్యాలు ఒకవైపు. పని చేయకుండా రికామిగా ఉండటం మరోవైపు. ఏదో పని చేసి ఎంతో కొంత సాధిస్తే కలిగే ఆనందం వేరు. అది ఏ పనైనా ఫర్వాలేదు.
ఎలాంటి ఉత్పాదకత లేకపోతే సంతోషం ఉండదు.
కవి అయితే కవిత్వాన్ని రాయాలి.
చిత్రకారుడైతే చిత్రాన్ని గీయాలి.
ఎవరికి ఏది ఇష్టమైతే ఆ పని చేస్తూ వుండాలి.
ఉత్పాదకత అనేది చాలా ముఖ్యమైనది.
మన ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది.
ఏదో సాధించామన్న తృప్తి కలుగుతుంది. భవిష్యత్తు మీద భరోసా కలుగుతుంది.
ఎలాంటి ఉత్పాదకత లేకపోతే ఎవరైనా నిరుత్సాహానికి ఆశాభంగానికి గురవుతాం. తప్పు చేసిన వాడిలాగా మారిపోతాం.
మీరు చేసే ఉత్పాదకత మీ నుంచి రావడం లేదంటే దానికి కారణం మీరే. ఎవరూ బాధ్యులు కారు.
మనం మంచం మీద నుంచి లేవగానే ఆ రోజుని ఎలా గడపాలో నిర్ణయించుకోవాలి. ఆ ముందు రోజు రాత్రే నిర్ణయం తీసుకుంటే మరీ మంచిది.
మనం ఏదైనా పని చేద్దామని అనుకున్నప్పుడు మన చేతిలో లేని అంశాలు ఎన్నో వుండవచ్చు.
ఏవో కొన్ని సంఘటనలు మన నుంచి మనం చేసే పనిని దూరం చేయవచ్చు.
ప్రతిరోజూ అలా వుండదు.
చాలా రోజులు మన వల్లే ఉత్పాదకత లేకుండా రోజు గడిచిపోతుంది.
ఏది చేయాలో అది గ్రహించండి. అది అమలు చేయండి.

- జింబో 94404 83001