S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అవీ-ఇవీ

అవీ-ఇవీ
ఈ శీర్షికలోని ఫొటోలు, విశేషాలు మమ్మల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా గాజుపెంకుల కొండలు, రష్యా కళాకారుడు తయారుచేసిన జీవం ఉట్టిపడే బొమ్మలు! వీటిని చూస్తే మాడమ్ టుసాడ్ మ్యూజియంలోని మైనపు బొమ్మలు చూసిన అనుభూతి కలిగింది. పేద ప్రజల వాహనాలకు తక్కువ ధరల పెట్రోలు గురించి అడిగారొకరు. వాహనాలున్నవారు పేదలా? రోడ్ల మీద రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల్ని చూస్తే ధరల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదనిపిస్తోంది. కొబ్బరికాయల ధర పెరిగిందని గుడిలో కొబ్బరికాయ కొట్టడం మానేశారా ఎవరైనా అన్న రావుగోపాలరావు డైలాగ్ జ్ఞాపకం వచ్చింది. చంపుతా లేదా ఛస్తా క్రైం కథ చిక్కని సస్పెన్స్‌తో భలేగా ఉంది.
-ఎ.చైతన్య (వాకలపూడి, తూ.గో.జిల్లా)
ఓ చిన్న మాట
‘ప్రతిభ’ శీర్షికన అందించిన వ్యాసం మా మనసులను హత్తుకొంది. నిజంగానే ఇది అక్షర సత్యం. మనం చేయాల్సిన పనులు చేస్తూనే ఉండాలి. రేపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎవరూ ఊహించలేరు. మనకు రాయగలిగే ప్రతిభ ఉంటే విరివిగా రాయాలి. అంతే కానీ రాయడం తగ్గించకూడదు. బొమ్మలు వేసే ప్రతిభ ఉంటే బొమ్మలు వేయాలి. నిరంతరం వేస్తూనే ఉండాలి. ప్రతి విషయంలోనూ అంతే! ప్రతి రంగంలోనూ అంతే. అలాగే ‘మేడారం పిలుస్తోంది’ అంటూ ఆ వివరాలు ఆసక్తికరంగా వివరించినందుకు ధన్యవాదాలు. అలాగే అరసవల్లి ఆదిత్య వైభవం కూడా ఆకట్టుకొంది.
-సదాప్రసాద్ (గొడారిగుంట)
సండే గీత
ప్రపంచంలో విలువైనవన్నీ ఉచితంగానే లభిస్తాయి. సంతోషం కూడా మన మనసులో ఉచితంగానే లభిస్తుందన్న విషయం గ్రహించలేక దాని కోసం పరుగులు తీస్తూ కష్టపడుతున్నామని ‘సండే గీత’లో గొప్పగా చెప్పారు. ‘సప్లై అండ్ డిమాండ్’ క్రైం కథ బాగుంది. అలాగే ‘అక్షరాలోచనాలు’లో ‘ప్రకృతి - మానవుడు’ కవిత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంది. ఓ మనిషీ స్వార్థాన్ని విడిచి అందరికీ సహకరించు.. అన్న వాక్యం ఆలోచింపజేసేదిగా ఉంది.
-బి.స్నేహమాధురి (పెద్దాపురం)
కంటతడి
ఈ వారం కథ ‘ఇంద్రధనస్సు’ కంట తడిపెట్టించింది. జ్ఞానం, కృషి, అంకిత భావమూ గల కృష్ణ్భగవాన్ మాస్టారు తన కొడుకులు, కూతురు, తమ్ముడు, భార్య, తోటి మాస్టార్ల ప్రవర్తన కారణంగా పక్షవాతం వచ్చి, ఆ తరువాత మరణించడం హృదయాన్న కలచివేసింది. కార్పొరేట్ పాఠశాలల్లో చదివినా ప్రభుత్వ టీచర్లంత మేధావులు అక్కడ ఉండరనిపించింది. తన దగ్గరికి ట్యూషన్‌కి వచ్చిన విద్యార్థి సందేహాలను ఓపికగా, అర్థమయ్యే విధంగా సోదాహరణంగా వివరించడం ఆకట్టుకొంది.
-సరికొండ శ్రీనివాసరాజు (హైదరాబాద్)
పెద్దల మాట
‘తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావ్ - తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావ్ - ఈ రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం’ అన్న అమూల్యమైన ‘పెద్దల మాట’తో ప్రారంభమై మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంది. ‘మీకు తెలుసా?’ ద్వారా మనం వాడుకగా వ్యవహరించే సుద్దలన్నీ మనం అనుకున్నట్లుగా ఒకటి కావనీ, కెనడా, ఉత్తర అమెరికాలో కనిపించే అందమైన పక్షులు తన శరీరానికి ఇన్‌ఫెక్షన్ సోకకుండా చీమలను చంపి ఈకలకు రుద్దుకుంటాయనీ, ఈ ప్రక్రియనే ‘యాంటింగ్’ అంటారని.. ఇలా ఎన్నో ఆసక్తిదాయకమైన విషయాల నెన్నింటినో తెలుసుకున్నాం. అక్షర విప్లవాన్ని సృష్టించిన అచ్చు యంత్రాన్ని మనకందించిన జోహన్ గూటెన్‌బర్గ్ మహాశయుని మననం చేసుకునే సదవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు.
-అల్లాడి వేణుగోపాల్ (బారకాసు)
ఓ చిన్న మాట
మనకు వెలుగు, నీరు, గాలి ఉచితంగా లభిస్తూంటే మనసంతా సంతోషంతో నిండాలి. సంతోషం ఎక్కడో దొరకదు. మన మనసులోనే ఉందనే ‘సండే గీత’ బాగుంది. మనం ముష్టివానికి ఏమీ ఇవ్వకపోయినా తిట్టకుండా ఉంటే అదే దయ. అందరిపట్లా ఆఖరికి మన అవయవాల పట్ల కరుణ కలిగి ఉండాలనే ‘ఓ చిన్న మాట’ గొప్ప పాఠం. అలాగే రణక్షేత్రం సీరియల్ బాగుంది. ‘ఇంద్రధనస్సు’ కథ ఆకట్టుకొంది. ఒక స్వచ్ఛమైన టీచర్ చరిత్ర - రిటైరయ్యేనాటికి బయట ఇంట్లో అన్నీ మార్పులే. సంతానం తనకు తలవంపులు తెచ్చేవారవడం, ఆర్థికంగా నలిగిపోయినా, భార్యగానీ, పిల్లలు గానీ సరిగా చూడకపోవడం.. ఇత్యాదివన్నీ చూస్తూంటే కంటతడి వచ్చింది.
-ఎ.వి.సోమయాజులు (కాకినాడ)
వసంత శోభ
విరబూసిన గులాబీని చూస్తే.. మనసు పరవశించిపోతుంది. గులాబీల్లాంటి తులిప్ పూలబారులు చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది. మత్తెక్కించే మల్లెపూల పరిమళం.. గమ్మతె్తైన బంతిపూల దొంతరలు.. ఆకాశాన్ని ముద్దాడేందుకు చిందులేసే నీటి తుంపరలు.. మీద పడుతూంటే ఒక్కో అడుగు వేస్తూంటే.. కాలం కరిగిపోతుంది. ఇది అక్షర సత్యం. మొఘల్ గార్డెన్స్ చూస్తూంటే కాలమే తెలీదు. కాలం అక్కడే ఆగిపోయి తీయటి అనుభూతిఒని మిగులుస్తుంది. అలాగే ‘సండే గీత’లో క్షణం క్షణం లో ప్రకృతిలోని ఎంతో విలువైన వాటిని మనం ఊరికే అనుభవిస్తున్నాం. అందుకే వాటి విలువ మనకు తెలీటం లేదు. ఉదయాన్నీ సాయంత్రాన్నీ అనుభవించండి. ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోండి అంటూ చక్కగా వివరించారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)

=================

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.