S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గానాలాపన

అరె! ప్రకృతి సోయగాలు కొత్తగా
హృదయాలను పులకింపజేస్తున్నాయెందుకో?
సుమధుర గానాలాపన చెవులకింపై
మదిని పరవశింప జేస్తోందేలనో?
నలుదెసలా వ్యాపించిన సుగంధ పరిమళాలు
మనసును మత్తెక్కిస్తున్నాయెందుకబ్బా?
కోటి సూర్యప్రభలు చంద్రప్రభలై చల్లగా
హాయిగా గొలుపుతున్నాయేం మాయో?
రోజూ వినిపించే కష్టాల కడగండ్లు
దూదిపింజల్లా తేలికై మోయగల
భారమనిపిస్తున్నాయ్
కష్టాలలో సుఖాలు వెతుక్కోమనే నీతి సూత్రాలు
చిరునవ్వులు తెప్పిస్తున్నాయేమిటో?
ఆ!ఆ! అవును. సగం మంది సరిగ్గా పలకలేకపోయిన
హేవలంబకి వీడ్కోలు పలుకుతూ
ఆశాకిరణంలా అరుదెంచే విలంబకి
స్వాగత గీతాలాపకి నాందీ ప్రస్తావనా?
మంజీవ నాడుల్లో సరికొత్త ఆశల రక్తాన్ని నింపి
మా హృదయాల్లో ఉల్లాసం, వదనాల్లో దరహాసం
చెదిరిపోకుండేటట్లు చూడాలని, చూస్తావని ఆశల
పందిరి అల్లుకుని ఎదురుచూసే ఆశాజీవుల
హృదయాలను రాగరంజితంచేస్తూ సుతిమెత్తగా
అడుగులిడే నీకిదే కోటికోటి ప్రజాతులతో
మా ఘనస్వాగతం!

-ఎం.ఆదిశేషామణి