S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వసుంధరకు ఉత్సవం

ఆగమించె ఆగమించె
విలంబ నామ వత్సరం
అందించెను వసుంధరకు
ఆనందపు ఉత్సవం

చివురాకుల దివ్వెలెత్తి
మావితరువు నిలిచింది
వాసంతుని స్వాగతించి
కోయిలమ్మ పిలిచింది

విచ్చుకున్న ప్రతి పువ్వూ
ముచ్చటపడి చూసింది
చేరవచ్చు మధుపానికి
తేనెవిందు చేసింది.

వేడుకతో వేపచెట్టు
గుత్తులుగా పూసింది
వగరు వగరు చూపులతో
వగలు ఒలకబోసింది

పరవశించి పల్లవించి
వనకామిని మురిసింది
వాసంతుని స్పర్శతోను
చింతలన్ని మరిచింది.

వాసంతుడు వచ్చాడని
వనతరువుల కన్నిటికీ
శుభవార్తను చేరవేయ
గాలి పరుగు తీసింది.

-ఈదుపల్లి