S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఘన స్వాగతం

హేవిలంబ నుంచి వీడ్కోలు
తీసుకొని అలా రుతు రాగాల నుంచి
విలంబ వచ్చిందో లేదో
కుహుకుహు అంటూ కోయిలలూ
ఆహ్వానం పలికాయి

షడ్రుచుల జీవితానికి
ఏది తక్కువైనా వొప్పేది లేదంటూ
మనిషిని నడిపించే కాలాల సాక్షిగా
ఆశని రంగరిస్తుంది.

గతం స్వగతాన్ని వదిలేసి
వర్తమానంలో ముందడుగు వేయాలంటూ
విలంబ నామం
చెవుల్లోకి మారుమోగితే
నిరాశ వీడిన జీవితానికి
ప్రతి దినము పండుగే...

గజిబిజి జీవితాల్లో
ప్రేమని మరిచిపోయిన కలికాలంలో
మనుషులంతా ఒక్కటే
మనమంతా తెలుగుదనానికి వారసులం అంటూ
వసుధైక సమ్మేళనాలకి
నాంది పలికే కవి సమ్మేళనాలు
ఉగాది పంచాంగాలను
ఎలా మరువగలము...

నాగరికత మాట నేర్వక ముందే
గణితాల్ని, భవిష్యత్తుని పుక్కిట పట్టిన
పంచాంగాల పండితనాన్ని
ఎవరైనా తక్కువ చెయ్యగలరా...

దేశభాషలందు తెలుగులెస్స
భాషతో ముడిపడిన పండుగని
రసరమ్యమైన కావ్యంతో
పులకరింపజేసే ఉగాది
ఎన్ని వసంతములు గడిచినను
తాజా అనుభూతినిచ్చేదే

సంతోషాల్ని తోటివారితో పంచుకొనే
సహృదయతని అందరికి పంచుతూ, మనతో సహజీవనం
సాగించేందుకు మరో వసంతంలోకి వస్తున్న
‘విలంబ’కి ఇవే మా స్వాగత తోరణాలు..!!
*

-పుష్యమీ సాగర్ 90322 15609