S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విజరుూభవ!

ఈ మధ్య అక్షరాలే కవిత్వం రాసుకొంటున్నాయి
కవులేమో అనువాదకులుగా మిగిలిపోతున్నారు..!
ప్రపంచం ఏయేటికాయేడు ఆశావహంగా.. ప్రజలు
భీతావహంగా రూపాంతరం చెందుతున్నారు
ఈస్ట్రోజన్ తరిగి కొలెస్ట్రాల్ ఖనులు పెరిగి
ఆలోచనలన్నీ అసహనంగా ఒళ్లు విరుచుకొంటున్నయ్
హేవలంబ పోతే విలంబ మలుపు తిరిగితే వికారి
నీరు పల్లమెరిగినట్టు ఆయుష్షు రూపేణ కాలం కరిగిపోతునే ఉంటుంది
రోజులట్లా తరిగిపోతున్నయ్ - తలలిట్లా నెరిసిపోతున్నయ్
డబ్బు కోసం పరుగు మొదలెట్టిన రోజే శాంతి చేజారిపోయింది
విజయం నచ్చడం లేదూ - అపజయమూ నచ్చడం లేదు
ఉగాదులు కేవలం రంగం సిద్ధం చేస్తాయంతే
‘జీవించి’ నాటకాన్ని రక్తికట్టించాల్సింది మనమే..!
కపటపు పూతలు కడిగేసి స్వచ్ఛమైన మొహాల్ని తగిలించుకొందాం
సంభాషణలు సరళ రేఖపై నిలుపుదాం.
ఆనందాన్ని నరనరాన ఆస్వాదిద్దాం
భయపడాల్సిన చోట నిశ్చయంగా భయపడదాం
ముసుగులొద్దు జీవితాన్ని జీవితంలా ప్రేమిద్దాం
అతడెవరో నాలుగక్షరాలు ఏరుకొని ఆత్మీయంగా విచ్చేస్తున్నాడు
మనం వొట్టి నిజమైన నవ్వు నవ్వి ఆహ్వానిద్దాం
నంది నాటకం సహజత్వంతో తొణికిసలాడాలి మరి..
అపుడు జీవితం కూడా చక్కని నాటకవౌతుంది
ఏడాదికోసారి కాదు - ఉగాది ఎపుడూ మనతోనే ఉంటుంది..!!

-చొప్పదండి సుధాకర్ 9177348349