S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫిచ్చితిళ్లు

ప్రశ్న: మా కుటుంబంలో ఐదుగురం ఉన్నాం. ఐదుగురివీ ఐదు రకాల రుచులు. ఒకరికి ఇష్టమైనది ఇంకొకరికి ఇష్టం లేదు. ఆహార వైద్యంలో మీరు చెప్పే సూచనలకు విరుద్ధమైనవే కావాలంటారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదంటే వినటం లేదు. చప్పిడి కూళ్లు తినాలా అంటున్నారు. అనారోగ్యకరమైనవే తినాలనే కోరిక ఉండటం ఏమైనా జబ్బా? దానికి నివారణ ఉందా?
జ: మనుషుల్లో ఎక్కువ మంది పిచ్చి తిళ్లకు ఎందుకు బానిసలౌతున్నారు? ఆహారపు జాగ్రత్తల గురించి కొందరే ఎందుకు అర్థం చేసుకో గలుగుతున్నారు? కొందరికి మాత్రమే ఆరోగ్య స్పృహ ఎందుకుంటోంది? ఆరోగ్యం పట్ల అనుకూల ధ్యాస ఉండేలా ఏదైనా ప్రత్యేక యంత్రాంగం ఈ కథను నడిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలు శాస్తవ్రేత్తల్ని చాలాకాలంగా వేధిస్తున్నాయి. ‘లోకో భిన్న రుచిః’ మనిషికో రుచి ఉంటుంది... అనేదే ఇంతకాలం ఈ ప్రశ్నకు సమాధానంగా ఉంది. ఇప్పుడు శాస్తవ్రేత్తలు పిచ్చి తిళ్ల మీద వ్యామోహానికి మెదడులో ఒక లోపం కారణం అని కనుగొన్నారు.
మెదడు ఆకృతిలోనూ, దాని నిర్మాణంలోను ‘ఆరోగ్య స్పృహ’నిచ్చే అంశాలలో తేడాలు ఉన్నాయని తాజా పరిశోధనలో శాస్తవ్రేత్తలు ఒక నిర్థారణకొచ్చారు. మెదడులో నుదురుకు వెనక వైపున ఉండే ‘గ్రే మేటర్’ అనే పదార్థం కొందరిలో ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉంటోందని, అలాంటి వ్యక్తుల్లో ఆరోగ్య స్పృహ, విచక్షణ, నియంత్రణ తక్కువగా ఉండటాన్ని శాస్తవ్రేత్తలు గుర్తించారు. మెదడులో ఉండే ఈ గ్రే మేటర్ మనసును అదుపు చేసేదిగా ఉంటుంది. రుచి అనేది మనసుకు సంబంధించిన విషయం కదా! మనసు మెదడు అధీనంలోనే ఉంటుంది. మెదడులో ఈ ‘గ్రే మేటర్’ సంపూర్ణ పరిమాణంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తులు నాణ్యమైన, ఆరోగ్యదాయకమైన రుచుల్ని ఇష్టపడేవారుగా ఉంటారని దీని భావం.
రకరకాల వంటకాలను వరుసగా ఉంచి ఇష్టమైన వాటిని ఎంచుకుని వడ్డించుకోమన్నాం అనుకోండి.. ఏయే రకాల పదార్థాల్ని ఏయే తరహా మనుషులు ఎంచుకొన్నారన్నది ఈ అధ్యయనం.
రుచులకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు, రంగులకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు, పులుపునకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు, మసాలాలకు లేదా స్పైసీ వంటకాలకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు, అలాగే నూనె పదార్థాలకు, మాంసాహారానికి, కేవలం కాయగూరలకి ఇలా ఒక్కో మనిషి ఒక్కో తరహాగా ఆహార పదార్థాలను ఇష్టపడతారు.
మనుషుల్లోనే ఇన్ని తేడాలు మనకు కనిపిస్తాయి. జంతువుల్లో ఇలాంటి వ్యత్యాసాలు ఉండవు. పశువులన్నింటికీ పచ్చగడ్డి, పెంపుడు పక్షులన్నింటికీ ధాన్యపు గింజలు ఇలా ఏ జంతువుకు ఆ జంతువుకి సాధారణ ఆహారం ఉంటుంది. కానీ, మనుషుల్లో ఆహారం విషయంలో ఈ సాధారణత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది.
సైన్స్ డైలీ 21 జూన్, 2018 సంచికలో ఆహార విజయాలు - వైఫల్యాలకు మెదడు నిర్మాణంలోనే తేడాలు ఉండటం కారణంగా ఒక నివేదికను ప్రచురించింది. మనుషుల్లో ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడే అనేక వైఫల్యాలు అంటే ఈటింగ్ డిజార్డర్స్ ఏర్పడటానికి మెదడులో రుచి విచక్షణకు సంబంధించిన గ్రే మేటర్ లాంటి పదార్థాలు కొంత తక్కువగా ఉండటం కారణంగా భావిస్తున్నారు.
ఇందులో సామాన్య పాఠకులకు ఉపయోగపడే అంశం ఏమిటన్నదే ప్రశ్న.
ఆరోగ్యదాయకమైన ఇష్టపడటం అనేది సర్వ సంపన్నమైన మెదడు ఉన్నవారికే సాధ్యం అనీ, ఇష్టారాజ్యంగా ఋంకు ఆహారాలకు అలవాటు పడేవారి మెదడులో లోపాలే కారణం అనీ ఒక వౌలికమైన నిర్ణయానికి మనం రావచ్చు. బింజి డ్రింకింగ్ అంటే ‘అదవ తాగుడు’, బింజి ఈటింగ్ అంటే ‘రాకాసి తిండి’. అలాగే, ఏది కనిపిస్తే దాన్ని తినాలనే కోరికని ఆపుకోలేక పోవటం, ఒక్కోసారి ఏదీ తినాలని అనిపించక పోవటం, ఏది తిన్నా సహించక పోవడం (్ఘశ్యూళనజ్ఘ శళ్ప్యూఒ్ఘ) లాంటి లక్షణాలన్నీ ఈ తేడాల వల్లనే ఏర్పడుతున్నాయి.
జాగ్రత్తగా తినాలి. ఆరోగ్యదాయకమైన వాటినే తినాలి. అపకారం చేసేవాటి మీద అసహ్యం కలగాలి.. ఇలా నిర్ణయాలను తీసుకునే మెదడు కార్యాల్ని (ఇ్ఘజశ చిఖశషఆజ్యశఒ ఇళ్దజశజూ జూళషజఒజ్యశ ఘౄరీజశ) న్యూరో ఎకనామిక్స్ అనే శాస్త్ర విభాగ అంశంగా అధ్యయనం చేస్తున్నారు.
‘ఆహారానికి సంబంధించిన న్యూరో ఎకనమిక్స్’ అనే ఈ కొత్త విభాగంలో ఆసక్తిదాయకమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రుచి ముఖ్యమా? ఆరోగ్యం ముఖ్యమా? అనే విచక్షణని మనిషికి కలిగించేది మెదడు. మెదడును మానవుడు అదుపు చేసుకోలేకపోతే, ఆట బొమ్మలం, తోలుబొమ్మలం అయిపోతాం. మనకు మనం అపకారం చేసుకునే అంశాల్ని గుర్తించి విషయాన్ని అర్థం చేసుకోవటం ద్వారా ఈ విచక్షణని మనిషి పెంపు చేసుకోగలగాలి.
కేన్సర్, కీళ్లనొప్పులు, షుగరు వ్యాధి, స్థూలకాయం, బీపీ వ్యాధి, గుండె జబ్బులు ఇలాంటి వ్యాధులు ప్రబలటంలో ఆహారం కలిగించే ప్రభావం గురించి మనం పెద్దగా ఆలోచించటంలేదు. అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర వండిన పదార్థాలు కేన్సర్ వ్యాధికి కారణం అవుతున్నాయి. వేపుడు కూరలు లేకపోతే ముద్ద దిగని వాళ్లు కేన్సర్‌ను రమ్మని పిల్చినట్టే లెక్క!
ఇలా అనారోగ్యదాయకమైన ఆహార పదార్థాల మీద వ్యామోహాన్ని కలిగి ఉండటం కొందరికి నాగరికమైన విషయం కావచ్చు. కానీ, అది మెదడులో లోపానికి సంకేతం అని వైద్య శాస్త్రం చెప్తోంది.
ఈ పరిశోధనల సారాంశానే్న మనం అర్థం చేసుకోవాలి. గ్రే మేటర్ అనేది మెదడులో ఒక కండరభాగం. తగినంత వ్యాయామం ద్వారా ఈ కండర భాగాన్ని పెంపు చేసి, మెదడును సంపూర్ణం చేసుకోవచ్చని ఈ పరిశోధకులు సూచిస్తున్నారు.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com