S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పగటి వెలుతురు

ఫ్రశ్న: తెల్లవారుజామున నిద్రలేస్తే తాజా వాయువులు పీల్చుకోవచ్చు అంటారు కదా! నిద్ర పోతున్నప్పుడు కూడా ఆ తాజా గాలుల్ని పీలుస్తాం కదా! ప్రొద్దునే్న నిద్ర లేస్తే కలిగే ప్రయోజనం మీద శాస్త్రం ఏమైనా ఉన్నదా? వివరంగా చెప్పగలరు.
జ: ‘బ్రాహ్మీ ముహూర్తే బుధ్యేత/ ధర్మార్థౌ చా నుచింతయేత్’ అని సూక్తి. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున నిద్ర లేవటం గురించి ఈ శ్లోకం చెప్తుంది. తెల్లవారుజామునే లేచి, ఆ రోజు చేయవలసిన మంచి పనుల గురించి ఆలోచించాలంటున్నాడు. ఇదే ముఖ్య సూత్రం. వైద్యశాస్త్ర పరంగా జరుగుతున్న అత్యంత తాజా పరిశోధనలు ఈ అంశంపైన విశేషాలనేకం వెల్లడి చేస్తున్నాయి.
కొలరాడో విశ్వవిద్యాలయం పరిశోధక బృందం బోస్టన్ మహిళా ఆసుపత్రిలో జరిపిన పరిశీలనలో తేలిన విషయం ఏమంటే తెల్లవారుజామునే లేచే అలవాటు చేసుకున్న వ్యక్తులకు మానసిక లక్షణాలు, దిగులు ఆందోళనల్లాంటి డిప్రెషన్ బాధలు త్వరగా తగ్గిపోతున్నాయి.. అని! ఈ పరిశోధకులు తెల్లవారుజామున లేచే వారిని ‘మార్నింగ్ పీపుల్’ అని, ‘ఎర్లీ బర్డ్స్’ అనీ సంబోధించారు. ఉదయం మనుషుల్లో సహృదయత ఉంటుందనేది దీని తాత్పర్యం.
ప్రాతఃకాలంలో నిద్ర లేవటమే డిప్రెషన్ వ్యాధికి మందులు లేని చికిత్స అని ఈ పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. సూర్యోదయాన్ని ఆస్వాదించమని సమస్త మానవాళికీ ఈ పరిశోధకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మనిషి మానసిక ఆరోగ్యాన్ని ఈ అలవాటు కాపాడ్తుందని చెప్తున్నారు. ఎన్నింటికి నిద్రపోయాం, ఎన్నింటికి నిద్ర లేచాం.. అనే అంశాల మీద మన మనసు, మన మెదడుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నమాట.
తీవ్రమైన దీర్ఘవ్యాధులతో బాధపడే మహిళల్లో రిస్క్ఫ్యుక్టర్ అంటే వ్యాధిని పెంచే అంశం మానసిక వత్తిడి లేదా డిప్రెషన్. దీన్ని అదుపు చేస్తేనే వ్యాధి పైన ఔషధాలు పనిచేయగలుగుతాయి. దీర్ఘవ్యాధులు ఏవైనా అవి మనసుతో ముడిపడి సాగుతాయి. వాటిని అరికట్టాలంటే మనసుని మురిపెంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయపు మెలకువ ఇందుకు సహకరిస్తుంది.
తెల్లవారటానికన్నా ముందే నిద్ర లేచాక చీకటి గదిలోంచి బయటకు వచ్చి, బాలభానుడి లేయెండ కెంజాయిలను ఎంజాయి చేయమంటున్నారు శాస్తవ్రేత్తలు.
37% మనుషులు ఉదయం పక్షులు కాగా, 10% మంది రాత్రి గుడ్లగూబలు అని ఈ శాస్తవ్రేత్తల పరిశీలనలో తేలింది. తక్కిన 53% మందీ ఈ రెండింటికీ మధ్య ఉంటారని తేల్చి చెప్పారు.
ఆలస్యంగా నిద్రపోయే వాళ్లు, ఆలస్యంగా నిద్రలేచే వాళ్లు స్వతంత్రంగా జీవించే వ్యక్తులై ఉంటారు. వీళ్లకు పొగతాగే అలవాటు ఉండే అవకాశం కూడా ఉంది. తమకు నిద్ర సరిగా పట్టడం లేదంటూ ఉంటారు. క్రమేణా నిద్రాలేమి వలన మెదడు పని సామర్థ్యం తగ్గిపోయి మానసిక బలహీనత కూడా ఏర్పడి డిప్రెషన్ లాంటి లక్షణాలకు లోనవుతుంటారు. రాత్రి గుడ్లగూబలుగా జీవించేవారు, ఆలస్యంగా నిద్రలేచేవారు త్వరగా డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉందని దీని భావం. ఆలస్యంగా నిద్రలేచేవారికన్నా ఆలస్యంగా నిద్రపోయే వారికి 6% ఎక్కువగా డిప్రెషన్ సోకే అవకాశం ఉందని ఈ పరిశోధనలు చెప్తున్నాయి.
జీవితంలో చీకటిని నిద్రలోనూ, వెలుగును పగటి పూటా గడపటం ఉత్తమం కదా! ఉదయం 9 గంటలదాకా నిద్ర లేవనివాడు జీవితంలో 3 నుండి 3.30 గంటల జీవనీయమైన వెలుగును కోల్పోయినట్టే కదా!
వంశపారంపర్య లక్షణాలు కూడా ఈ క్రోనోటైపుని అంటే ప్రొద్దునే్న లేవాలనే తత్వాన్ని ప్రభావితం చేస్తాయని ఈ పరిశోధకులు కనుగొన్నారు. బహుశా కుటుంబ వాతావరణం, చిన్ననాటి నుండీ పెరిగిన తీరు దీన్ని ప్రభావితం చేసే అంశాలు కావచ్చు. నిద్రపోవటం, మేలుకోవటం అనేవి జెనెటిక్ అంశాలే!
మనిషి అప్పుడప్పుడూ రాత్రిపూట మెలకువగా ఉండి పగలు నిద్రపోవటం చేయగలడు గానీ, రాత్రిపూట మాత్రమే మేలుకునే విధంగా జీవించలేడు. ఎందుకంటే పగలు మెలకువ, రాత్రి నిద్ర అనేది మానవ జాతిలక్షణం. అయితే జన్యుపరమైన కారణాల వలన నిద్రాచక్రంలో తేడాలేర్పడవచ్చు. దానివలన డిప్రెషన్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఈ పరిశోధన మరో ముఖ్య అంశాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది. అది వెలుగుకు సంబంధించిందే! వెలుతురు కూడా క్రోనోటైపుని ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధన నిరూపిస్తోంది. జీవించే విధానంలో వెలుతురు తగ్గిపోతే జీవితంలో కూడా వెలుగు తగ్గిపోతుందంటోంది ఈ పరిశోధన. వెలుగుని తక్కువగా ఆస్వాదించే వారిలో డిప్రెషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ పరిశోధకులు కనుగొన్నారు. డిప్రెషన్ ఎక్కువగా ఉండే వారి జీవితంలో పగటి వెలుతురు ఎక్కువగా ఉండేలా చేయటం అవసరం అని దీని భావం. ఏ ఇంట్లో పగలు కూడా లైట్లు వేసుకుంటారో ఆ ఇంట్లో ‘డిప్రెషన్’తో బాధపడేవారు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా గమనించాలి.
రాత్రిపూట పెందరాళే నిద్రపోవటం, తెల్లవారుజామునే లేవటం, సూర్యోదయాన్ని చూడటం, వెలుతురును ఆస్వాదించటం ఇవి చేయదగిన పనులు. వీటివలన దేహపుష్ట, మనోబలం పెరుగుతాయి. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్’ అని కదా ఆర్యోక్తి. ఆరోగ్యం సూర్యుడి ఆధీనంలో ఉంటుందని దీని భావం. సూర్యుడి వలన కలిగే అనేక ప్రయోజనాలలో ఇప్పటిదాకా మనం చెప్పుకునేదీ ఒకటి.
సూర్యుడికన్నా ముందు లేచెడివాడు ధన్యుడు. ఉ్ఘక డళళఔళూఒ ఘశజూ జఒళూఒ ఒక సంఘంగా ఏర్పడి ఈ అంశాన్ని ప్రచారంలోకి తీసుకురావలసిన అవసరం ఉంది. మానసిక బలసంపన్నత కోసం ఇది అవసరం కూడా! నిద్ర విషయంలో వేళాపాళా పాటించే తత్వాన్ని క్రోనోటైప్ అంటారు. క్రోనోటైప్ తత్వానికి, డిప్రెషన్ తగ్గడానికి సంబంధం ఉందని ఇప్పుడు శాస్తవ్రేత్తలు నిర్ధారిస్తున్నారు.
తెల్లవారుజామునే నిద్ర లేవండి అని చాటి చెప్పడానికే ఇంత పరిశోధన!

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com