S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆస్తమా.. ఆహారం

ఫ్రశ్న: ఆస్తమా వ్యాధి 15 ఏళ్లుగా ఉంది. తగ్గటంలేదు. ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలో చెప్తారా?
-లక్ష్మీరాజ్యం బందా (సికిందరాబాద్)
జ: వ్యాధుల్లో వచ్చేవీ తెచ్చుకునేవీ రెండు రకాలూ ఉంటాయి. వాటంతట అవే వచ్చే వ్యాధుల్లో కూడా వ్యక్తి చేసే అపరాధాల వలన రేపెప్పుడో వచ్చే వ్యాధి నేడే వచ్చే ప్రమాదం ఉంటుంది. నేటి వ్యాధిని రేపటికి వాయిదా వేయటం తెలివైనవాడు చేయగల పని! ముఖ్యంగా ఆస్తమా వ్యాధిలో ఈ సూక్తి మరీ వర్తిస్తుంది.
కూరగాయలు, పండ్లు, పాలిష్ పట్టని ధాన్యం ఇవి ఆస్తమా వ్యాధిలో మేలు చేసేవిగా ఉంటాయి. శజూజ్ఘశ్ఘఒ్య్య అనే శాస్తవ్రేత్తని ఉటంకిస్తూ యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ ఇటీవల 34,776 మంది మీద చేసిన ఒక పరిశోధనను ప్రకటించింది. నాణ్యమైన ఆహారం ఆస్తమా నివారణకు ఏ విధంగా తోడ్పడుతుందో దీనిలో వివరించింది. తేలికగా అరిగే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటిని దళ్ఘఆ్దచిఖ జూజళఆ గా ఈ నివేదిక పేర్కొంది. పారిస్‌లో చేసిన ఈ పరిశోధనలో 25% పురుషుల్లోనూ, 28% స్ర్తిలలోనూ ఆస్తమా అంతో ఇంతో ఉన్నట్టు తేలింది. ఫ్రెంచి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, పారిస్ వారి నివేదికలో గొడ్డుమాంసం ఇంకా కఠినమైన మాంసాహారాలు ఉబ్బస రోగులకు శత్రువులని ప్రకటించింది.
ఉబ్బసానికి జీర్ణశక్తికీ చాలా దగ్గర సంబంధం ఉంది. మన శరీరానికి సరిపడని ఆహార పదార్థాలు కలిగించే ఎలర్జీ వ్యాధుల్లో అజీర్తి ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. పడని పదార్థం శరీరానికి విషంతో సమానమే! భీముడికి కౌరవులు విషం పెట్టారు. కానీ భీముడు చావలేదు. ఎందుకంటే ఆయన వృకోదరుడు. అనగా తోడేలు వంటి ఉదరం కలిగినవాడు. తోడేలు సహజంగా అత్యధిక జీర్ణశక్తి కలిగిన జంతువు. అందుకని దానికి సన్నని నడుము ఉంటుంది. తోడేలు వంటి నడుము, తోడేలు వంటి ఆకలి కూడా కలిగినవాడు భీముడు. పర్వతాలు ఫలహారం చేయగల జీర్ణశక్తి ఉన్నవాడు కాబట్టే విషం పెట్టినా అతనికి ఏమీ కాలేదు. జీర్ణశక్తి మందగించిన వారికి అమృతం కూడా విషంగానే పరిణమిస్తుంది. ఆ ఊరెడితే నీళ్లు పడలేదండీ అంటుంటారు కొందరు. నీళ్లే పడని వాడికి గోంగూర పచ్చళ్లూ, ఊరుగాయ పచ్చళ్లూ, పలావులూ ఇంకేం పడతారుూ..?
ఆస్తమా వ్యాధిలో ఎలర్జీ తీవ్రత అదుపులో ఉండాలంటే మొదట జీర్ణశక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. జీర్ణశక్తిని చెడగొట్టే కఠిన ఆహార పదార్థాలను వదిలేయాలి. కూర ఎక్కువగా, అన్నం తక్కువగా తినేవారికి ఆస్తమా అదుపులో ఉంటుంది. ఇది ముఖ్య సూత్రం.
కేన్సర్ ప్రమాదాన్ని నివారించటం, బరువు తగ్గటం, గుండె జబ్బులు, బీపీ షుగరు మొదలైన వ్యాధులు అదుపులో ఉండటం ఇవన్నీ ఈ ‘హెల్త్ఫుల్ డైట్’ వలనే సాధ్యం అవుతాయి. ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తుల కోసం ఆస్తమా రోగులే కాదు ఆస్తమా లేనివారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరమే కదా! ఆరోగ్యాహారం అంటే ఎక్కువగా పండ్లు, కూరగాయలు పరిమితంగా అన్నం, బాగా తక్కువగా మాంసం, ఉప్పు, పంచదార/ చక్కెర (బెల్లం) - ఈ విధంగా ఆహార ప్రణాళికని రూపొందించుకుంటే స్ర్తి పురుషుల్లో 20-30% ఆస్తమా అదుపులో కొచ్చినట్లు కనుగొన్నారు.
ఈ సూత్రాన్ని చెప్పటంలో ఒక ప్రయోజనం ఉంది. సాధారణంగా ఆస్తమా రోగులు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమేం తినవచ్చో రాసివ్వమని అడుగుతుంటారు. పడటం, పడకపోవటం అనేది రోగి వ్యక్తిగత విషయం. తన శరీరానికి ఏది సరిపడ్తుందో, ఏది సరిపడట్లేదో జాగ్రత్తగా పరిశీలించి చూసుకోవాల్సిన బాధ్యత రోగిదే! వ్యక్తిగతంగా ఏదైనా ఒక పండుగాని, కూరగాయ గానీ, ఆకుకూర గానీ కొందరికి సరిపడకపోవచ్చు. దాన్ని తప్ప తక్కిన పండ్లను కూరగాయలను ఎక్కువగానూ, అన్నం తక్కువగానూ తినేవారికి ఆస్తమా పదేపదే రావటం అనేది చాలావరకూ తగ్గుతుంది. ఆరోగ్యాహారం తీసుకుంటే అప్పుడప్పుడూ ఆస్తమా వచ్చేవారిలో 60% పైగా మార్పు వచ్చినట్టు గమనించారు.
వ్యాయామాలు, ఆహార నియమాలు చెప్పకుండా ఆస్తమాకి మందు ఇవ్వగలరా? ఎంత కావాలి..? అని ఒకాయన అడిగాడు. దేన్నయినా డబ్బుతో కొనేయగలమనుకోవటం పొరపాటు. ఆరోగ్యాన్ని జీవన విధానాన్ని మార్చుకోవటం ద్వారా సరిచేసుకోవటం అవసరం అని పైన పేర్కొన్న నివేదిక చెప్తోంది.
కూరగాయల ద్వారా, పండ్ల ద్వారా ఫైబరు (ఆహార పీచు పదార్థం) కడుపులోకి తగినంతగా వెడుతుంది. విషదోషాలను తగ్గించేవీ, ఊపిరితిత్తుల్లో వాపు తగ్గించేవీ (్ఘశఆజ్యనజజ్ఘూశఆ ఘశజూ ఘశఆజ జశచ్ఘ్ఘిౄౄఆ్యక) ఈ కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, పండ్లను కాదని మాంసం, ఉప్పు, చక్కెర ఈ మూడింటినీ అతిగా తీసుకునేవారికి ఆస్తమా వచ్చే అవకాశాలు, పెరిగే ప్రమాదాలూ ఎక్కువగా ఉంటాయని శజూజ్ఘశ్ఘఒ్య్య శాస్తవ్రేత్త గట్టిగా నొక్కి చెప్తున్నాడు.
ఆకు కూరలు, కూరగాయలూ అన్నీ మేలుచేసేవే! ఏదైనా ఒకటీ అరా సరిపడకపోవచ్చు. సాధారణంగా మన తెలుగు వాళ్లు వంకాయ గోంగూర మానేసి చాలా పథ్యం చేస్తున్నామంటూ ఉంటారు. అవి సరిపడకపోతేనే మానాలి. సరిపడేవాళ్లు కమ్మగా వండుకుని హాయిగా తినవచ్చు. అతిగా పులుపుగానీ, అల్లం వెల్లుల్లి మసాలాలు గానీ, శనగపిండి గానీ కలిపి వండినప్పుడు, నూనెలో వేసి వేయించినప్పుడూ, తేలికగా అరిగే కూరగాయలు కూడా కష్టంగా అరిగేవిగా మారిపోయి ఆస్తమా తెస్తాయి.
పులుపు మానేయండి. మసాలాలను బాగా పరిమితం చేయండి. వేపుడు కూరలు తినకండి. కూర ఎక్కువగా, అన్నం తక్కువగా తినండి. ఆస్తమా మీ అదుపులో ఉంటుంది.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com